మహిళా ఎస్ఐ ఆత్మహత్య యత్నం.. ఎందుకో తెలుసా?
posted on Jun 15, 2021 @ 2:29PM
ప్రేమించడం అనేది సహజంగా అందరికి ఉండే లక్షణం. ప్రేమించడం నేరం ఏమి కాదు.. అలా అని వీళ్ళు మాత్రమే ప్రేమించుకోవాలి అని ప్రేమలో ఎలాంటి రూల్స్ లేవు. అందరి ప్రేమలు బయట పడ్డట్లే తాజాగా ఒక లేడీ పోలీస్ ప్రేమ బయటపడింది.. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే పోలీసులు ప్రజలకు ప్రాబ్లమ్స్ వస్తే దైర్యం చెప్పే వాళ్ళు. ఒక మహిళా ఎస్ఐ. ఖాకీ వేసుకుని నీతికోసం పని చెయ్యాల్సిన ఆమె.. చివరికి ప్రేమ ముసుగులో పడి ప్రాణాలు తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా..
వాళ్ళు ఇద్దరు డ్యూటీ చేయాల్సిన పోలీసులు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. సరే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఈమె బోరు కొట్టిందో..లేదంటే ఏం జరిగిందో తెలీదుగానీ.. అతను వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇక అంతే అప్పటివరకు జంటగా ఉన్న వాళ్ళు విడిపోయారు.. లేడీ ఎస్ఐ మనస్తాపం చెందింది.. బాధలో బంధీ అయింది. ప్రియుడు తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ఉండలేకపోయింది. ఈనెల 12వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయోధ్యనగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది. తాను చనిపోతున్నానంటూ సీసీఎస్‌లో పనిచేసే ఓ ఎస్ఐకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన వెంటనే సత్యనారాయపురం సీఐ బాలమురళీకృష్ణకు చెప్పి ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె కింద పడిపోయి ఉంది. పక్కన గోళ్ల రంగు, శానిటైజర్ సీసాలు ఉండటంతో వాటిని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని నిర్ధారించుకున్నారు. ఆమెను వెంటనే సింగ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పీఎస్సై ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించిన మహిళా పీఎస్సైపై వారం రోజుల క్రితం మాచవరం పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలుస్తోంది.
తన భర్తకు రాత్రి సమయంలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాట్సాప్‌లో వందలకొద్దీ మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతోందటూ సీసీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భార్య మాచవరం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై ఓ వైపు పోలీసులు విచారణ చేస్తుండగా మహిళా పీఎస్సై ఆత్మహత్యకు యత్నించడం, దీనికి కారణం ప్రేమ వ్యవహారమేనన్న వదంతులు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, మహిళా పీఎస్సైతో పాటుగా సీసీఎస్ ఎస్ఐపైనా శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అంత చదివిన ఎస్ఐ కి లవ్ పోతే ఇంకో లవ్ ఉంటుంది.. ప్రాణం పొతే ఇంకో ప్రాణం ఉండదు అని తెలుసుకోలేకపోయినట్లు ఉన్నారు.. అయినా ఒక అమాన్యుడు ఆత్మహత్య చేసుకుంటే విరిచారణ జరపాల్సిన పోలీసులు ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి ? అది ఏ డ్యూటీలో ఐతే ఇంకా బాగుండేది. ప్రేమ కోసం మరి ఇంకో అమ్మాయి భర్త ఒక ఎస్ఐ చనిపోవడం ఎందటి స్థానికులు విస్తుపోయారు..