కుండబద్దలు సుబ్బారావు ఇక లేరు
posted on Jan 2, 2023 @ 4:46PM
రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు అలియాస్ కుండబద్దలు సుబ్బారావు మరణించారు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం (జనవరి 2 ) కన్నుమూశారు. తన యూట్యూబ్ వీడియోలతో కుండబద్దలు సుబ్బారావుగా ప్రసిద్ధి కెక్కిన ఆయన దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.
డయాలసిస్ చేయించుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కుండబద్దలు సుబ్బారావును తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం( జనవరి 1)న పరామర్శించారు కుండబద్దలు సుబ్బారావు మృతి పట్ల ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే.
ఏపీ హైకోర్టు ఆ కేసుపై స్టే ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జనగ్ పై అనుచిత విమర్శలు చేశారంటూ వైసీపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆ కేసుపై హైకోర్టు స్టే విధించిన సంగతి విదితమే.
అధికార పార్టీ విధానాలపై, ప్రజా వ్యతిరేక చర్యలపై సునిశిత విమర్శలు గుప్పించే సుబ్బారావు కుండబద్దలు సుబ్బారావుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.