కేసీఆర్, కేటీఆర్ ముఖాల్లో పైశాచిక ఆనందం!
posted on May 14, 2024 @ 11:22AM
ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని పోలింగ్‌కి ముందే అందరూ ఫిక్సయిపోయారు. వేరే పార్టీవాళ్ళ సంగతి అలా వుంచితే, సాక్షాత్తూ బీఆర్ఎస్ ప్రధాన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు కూడా ఒక్క పార్లమెంట్ సీటు అయినా వస్తుందన్న నమ్మకం లేదు. అయినప్పటికీ, మరీ చేతులు ఎత్తేస్తే బాగోదు కాబట్టి, బిల్డప్పులు ఇస్తూ, మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ 12 నుంచి 15 సీట్లు వస్తాయంటూ షో పుటప్ చేస్తూ కాలం గడుపుకుంటూ వచ్చారు. సోమవారం నాడు జరిగిన పోలింగ్ సరళిని చూశాక బీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదన్న విషయం కన్ఫమ్ అయిపోయింది. అడ్డంగా ఆరిపోయిన తన పార్టీ గురించి ఏడవకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి నిన్న కేటీఆర్ ఏడిచాడు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలవటం ఖాయమని ఈయన ఆనందపడిపోతూ చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది కదా. అదే జగన్ గెలిస్తే, మా పాలనలో తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని చెప్పుకుని తిరగొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడు అని చెబుతున్నప్పుడు కేసీఆర్ ముఖంలోగానీ, కేటీఆర్ ముఖంలోగానీ కనిపించే పైశాచిక ఆనందాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. నాకు ఒక్క కన్ను పోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళకి రెండు కళ్ళూ పోవాలని కోరుకునే టైప్ ఈ కేసీఆర్ ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని కోరుకునేవాళ్ళలో ముందుండేవాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ. వీళ్ళు అంతిమ క్షణాల్లో వున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటారు. ఇలాంటివాళ్ళ జీవితాంతం ఏడ్చి చావడానికే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.