కేటీఆర్ కు సీఎం యోగం లేనట్లేనా? అడ్డుకుంటున్నది వాళ్లేనా?
posted on Aug 24, 2021 @ 3:09PM
అంతేనా ఇక కేటీఆర్’కు ఇప్పట్లో ముఖ్యమంత్రి యోగం లేనట్లేనా, హుజూరాబాద్’ ఎపిసోడ్’ ప్రారంభానికి ముందు మిణుకు మిణుకు అంటున్న ఆశలు ఇప్పుడు పూర్తిగా ఆవిరై పోయినట్లేనా? అంటే, అంతేగా’ అనే సమాధానమే వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులలో ‘నా పార్టీ .. నా ఇష్టం’ అనే పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు. అలా అనుకునే కేటీఆర్ పట్టాభిషేకానికి, అవరోధంగా ఉన్నారన్న ఉద్దేశంతో, ఈటల పై వేటు వేశారు. అయితే, అది ఎవరి అదృష్టమో, ఇంకెవరి దురదృష్టమో కానీ, ఈటల పై వేసిన వేటు, కేటీఆర్, రహదారిని పూర్తిగా బ్లాకు చేసేసింది. ఇప్పుడు, కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ చేరుకోవాలనే, అరడుగుల బులెట్ ను దాటుకుని ముందుకు పోవాలి.. అది అయ్యే పని కాదు. ఇప్పడు హరీష్ రావును కాదని ముఖ్యమంత్రి ముందుగు వేసే పరిస్థితి లేదంటున్నారు అంతర్గత విశ్లేషకులు.
సో.. ముఖ్యమత్రి కుర్చీలో కూర్చునేందుకు కేటీఅర్ కనీసం మరో రెండున్నర సంవత్సరాల పాటు ఆగక తప్పదు. అంతవరకు ముఖ్యమంత్రి కుర్చీ వైపు దూరం నుంచి చూస్తూ ఉండడమే కాని, కూర్చునే ఛాన్స్ మాత్రం లేదని, అయన సన్నిహిత వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అంతే కాదు, అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తునారని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గత (2018) అసెంబ్లీ ఎన్నిల్లో ఎక్కడ బీరపోకుండా సిట్టింగులు అందరికీ, టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్, ఈసారి, కొద్ది మంది పూర్ణ విధేయులకు తప్పించి, మిగిలిన అన్ని సీట్లలోనూ, కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టే, ‘యువత’ కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవలనే రాజకీయ అరంగేట్రం చేసి, బీఎస్పీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికార ప్రవీణ్ కుమార్, ద్వారా బీఎస్పీతో పొత్తు పెట్టుకుని దళిత ఓటుపై పట్టు పెంచుకునేందుకు కూడా ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ అన్నిటినీ మించి హుజూరాబాద్ గండం గట్టెక్కిన తర్వాత, హరీష్ రావును రాజ్య సభకు పంపి, ప్రధాన అడ్డంకిని తొలిగించుకుంటారనీ అంటున్నారు. అయితే, అప్పటికి రాజేవరో, రెడ్దేవరో పరిస్థితులు ఎలా మరాతాయో ఇప్పుడే ఉహించడం కష్టం. రాజకీయాలు డైనమిక్ గా, మారిపోతుంటాయి. తప్ప నిశ్చల చిత్రాల్లా కదలని బొమ్మలా ఉడి పోవు, కాబట్టి రేపటి కథ రేపు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
అయితే ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికీ లేకున్నా, ప్రాంతీయ ,కుటుంబ పార్టీలలో నాయకుడి సంతానమే వారసుడు అవుతారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, మినహాయింపులు ఉండవు. దేశానికి ఆ కొసనున్న జమ్మూ కశ్మీర్, ఈ కొసనున్న తమిళ నాడు వరకు ఇదే ‘సంప్రదాయం’ కొనసాగుతోంది. ఇందుకు తెలంగాణ, తెరాస మినహాయింపు కాదు. అయితే, ఎంత కుటుంబ పార్టీనే అయినా, కొన్ని కొన్ని సందర్బాలలో కుటుంబంలోనే వారసత్వ తగవు తలెగరేస్తుంది. ఉత్తర ప్రదేశ్’లో సమాజవాదీ పార్టీలో, ములాయం వారసత్వం కోసం, అయన కుమారడు అఖిలేష్ యాదవ్, సొదరుడు శివపాల్ యాదవ్ మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అఖిలేష్ అంతిమ విజేత అయ్యారు. అలాగే, తమిళనాడులో కరుణానిధి కుమారులు స్టాలిన్, అలిగిరి, కుమార్తె కణిమోళీ మధ్య కొంత కాలం ముక్కోణ పోటీ, ఇంకొంత కాలం బ్రదర్స్ ఇద్దరి మధ్య ముఖాముఖి పోరాటం సాగింది. స్టాలిన సక్సెస్ మాత్రమే కాదు, సక్సెసర్ కూడా అయ్యారు.
అలాగే, బీహార్’లో లాలూ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్’ల వారసత్వ వార్ నడిచింది. తేజస్వి గెలిచారు ... అయితే, ఎక్కడైనా, “జో జీతేగా ఓయీ సికిందర్’ అన్నట్లు, గెలిచిన వారే యువ రాజయ్యారు. రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయారు. పోతున్నారు. ప్రస్తుతం కల్వకుట్ల ఫ్యామిలీ పార్టీ తెరాస వారసత్వం కోసం కూడా ద్విముఖ, త్రిముఖ కాదు ఏకంగా చతుర్ముఖ పోటీ జరుగుతోందని అంటున్నారు.. ఇక్కడైనా అంతే జో జీతేగా వోయీ సికిందర్. అది కేటీఅర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత, సంతోష్ ఎవరైన కావచ్చును, ఇది ప్రగతి భవన్ గేటు లోపలి మాట.