కోదండరామ్ అరెస్ట్
posted on Oct 22, 2012 @ 3:22PM
మహబూబ్ నగర్ జిల్లాలోకి అడుగుపెట్టిన చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రని అడ్డుకునేందుకు వెళ్లిన తెలంగాణ జెఎసి నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ తోపాటు స్వామిగౌడ్, శ్రీనివాస్ లను శాంతి నగర్ లో అరెస్ట్ చేశారు. తెలంగాణపై బాబు వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తామని, యాత్రని అడ్డుకోబోమని చెప్పి అక్కడికెళ్లిన జెఎసి నేతల్ని, తెలంగాణ వాదుల్ని టిడిపి కార్యకర్తలు నిలువరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జెఎసి నేతల్ని అరెస్ట్ చేశారు. రాజోలికి వెళ్లేందుకు ప్రయత్నించిన జెఎసి నేతల్ని పోలీసులు శాంతి నగర్ లోనే నిలువరించారు