కొడాలి నాని.. కొత్త డ్రాయర్లు!
posted on Jun 22, 2024 @ 11:13AM
నమస్తే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని, ఉరఫ్ గుట్కా నాని అన్నా.. ఆరోగ్యం ఎలా వుందన్నా? నువ్వు గుడివాడలో ఓడిపోయిన వెంటనే ఒకసారి బయట కనిపించి, ‘తెలుగుదేశం వాళ్ళ నుంచి నన్ను కాపాడండయ్యా’ అని పోలీసులకు మొరపెట్టుకున్నావు. పులి లాంటి మా అన్న ఇలా బేలగా మాడ్లాడ్తన్నాడేంటని నేను బాగా ఫీలయ్యాను. ఆ తర్వాత మొన్న జగన్‌తో మీటింగ్ జరిగిన తర్వాత నువ్వు మీడియాతో మాట్లాడుతూ, నీదైన స్టైల్లో అవాకులు, చవాకులు పేలావు. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నువ్వు మారిపోయావేమోనని అప్పటి వరకూ భయపడిచచ్చిన నాకు, మొన్న నువ్వు ‘పీకుతాడా’, ‘వెధవలు’ అని నీ శైలిలో రెచ్చిపోవడం చూసి చాలా ఆనందం కలిగింది. మా కొడాలి నాని అన్న ఏంటి.. మారడం ఏంటి? నువ్వు మనిషివైతే కదా మారడానికి. నువ్వు మనిషివి కాదంటే ఏ పశువువో అన్నానని అనుకోకన్నోయ్.. నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు.. దేవుడివి!
ఈ నారా లోకేష్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ప్రారంభమైపోయిందన్నా. మీ పార్టీ ఆఫీసునే కూల్చేయడంతో శుభారంభం చేశారంటే ఫ్యూచరు ఏ రేంజ్‌లో వుంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే భయమేస్తందన్నా. ముఖ్యంగా నా భయం నీ గురించే అన్నా. నిన్ను డ్రాయర్ మీద గుడివాడ వీధుల్లో నడిపించే బాధ్యత తనదని నారా లోకేష్ ఆల్రెడీ ప్రకటించాడు. మొదట్లో లోకేష్ కామెంట్లని లైట్‌గా తీసుకున్నానుగానీ, పరిస్థితి చూస్తుంటే లోకేష్ చెప్పింది జరిగేట్టే వుంది అన్నా. జరగబోయేది ఆపే పరిస్థితి ఎలాగూ కనిపించడం లేదు కాబట్టి, మన జాగ్రత్తలో మనం వుంటే మంచిదన్నా. ఆ జాగ్రత్తలు చెప్పడానికే నీకీ లేఖ రాస్తున్నా.
త్వరలో నువ్వు గుడివాడ రోడ్ల మీద డ్రాయర్‌తో నడవటం ఖాయం కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా నువ్వు కొత్త డ్రాయర్లు కొనుక్కో అన్నా. ఎలక్షన్ల హడావిడిలో పడి డ్రాయర్లు కొనుక్కున్నావో లేదో. నిన్ను సడెన్‌గా డ్రాయర్ మీద రోడ్డు మీద నిలబెట్టినప్పుడు ఆ డ్రాయర్లు చిరిగిపోయి వున్నాయనుకో.. చూడ్డానికి బాగోదు. అందుకని, కొత్త డ్రాయర్లు కొనుక్కుని వాడుతూ వుండు. ఎందుకంటే, ఏ నిమిషంలో అయినా నువ్వు డ్రాయర్ ధారణతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేట్టుంది. అలాగే, నువ్వు కట్ డ్రాయర్లతో రోడ్డు మీద నడుస్తుంటే జనం చూడలేక చస్తారు. అందువల్ల నువ్వు ఆ కట్ టైప్ కాకుండా నిక్కర్ టైప్ డ్రాయర్లు కొనుక్కో. ఆ విధంగా గుడివాడ ప్రజలకు మేలు చేసినవాడివి అవుతావు. సరే, ఉంటానన్నా.. త్వరలో నిన్ను గుడివాడ రోడ్ల మీద కేవలం డ్రాయర్‌తో నడుస్తావుగా.. అప్పుడు నిన్ను కలుస్తాలే.. బైబై.. ఇట్లు.. నీ అభిమాని.