గుట్కా నానికి కొత్త పిచ్చి పట్టింది!
posted on May 11, 2024 @ 1:08PM
బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు. మొన్నటి వరకూ బూతే భవిష్యత్తు అన్నట్టుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్త పిచ్చి ఎక్కించుకుని ఆరకంగా ముందుకు వెళ్తున్నారు. తాను కన్ఫమ్‌గా గెలవనని తెలిసినా, దింపుడుకళ్ళం ఆశతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నాని, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ప్రచారంలో వింత పోకడలు పోతున్నారు.
కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడకి వెళ్ళినా లోకల్ కార్యకర్తలు పూల మీద నడిచే ఏర్పాటు కంపల్సరీ చేయాలట. అలాగే గజమాల కంపల్సరీ. చేతులకు దారాలు, మెడలో రుద్రాక్షలు ఎలాగూ వుంటాయి కాబట్టి, ఇప్పుడు అడిషనల్‌గా పాదపూజల సిస్టమ్ కూడా ప్రారంభమైంది. ప్రతిరో్జూ ఎవరో ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కార్యకర్త చేత కొడాలి నానికి పాదపూజ చేయించడం ప్రతిరోజూ కామన్. దీన్నే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారని స్థానికులు అనుకుంటున్నారు.