కేతేపల్లి మర్డర్ ఆడియో టేపు.. లీక్
posted on Jul 21, 2021 @ 5:20PM
పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. పాలించడం కూడా తెలుసు అని సినిమా డైలాగ్ వినేవుంటారు. అది అక్షరాల నిజం. కానీ నేటి యువత ఆ మాటలు పఠియించుకోవడం లేదు. ప్రేమ ముసుగులో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన , ఎన్ని శిక్షలు వేసిన ఈ దాడులు మాత్రం ఆగడం లేదు..జీవితాన్ని మరిచి ఉన్న దాడులు చేస్తున్నారు ఆవేశంలో ప్రాణాలు తీస్తున్నారు. యువతిని అకారణంగా రేప్ చేసి.. ఆపై చంపేశారు దుర్మార్గులు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు యువకులు పీకలదాకా తాగి.. చిత్రహింసలకు గురి చేసి మరీ హతమార్చారు. ఎవ్వరికీ హాని చేయని మైనర్ బాలిక ఆర్తనాదాలు చేసినా.. మద్యం మత్తులో ఉన్న ఆ నీచులు కనికరించకుండా పొట్టనపెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మైనర్ బాలికను.. పవన్ మాయమాటలు చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై చిత్రహింసలకు గురి చేశాడు. ఎక్కడ తమ బాగోతం బయటపెడుతుందోనన్న బెంగతో బాలిక మెడకు చున్నీచుట్టి చంపేశారు.
ఆ సమయంలో నిందితుడు పవన్.. బాలిక బావ రాజుకు ఫోన్ చేశాడు. అమెను చంపేసి జైలుకు వెళ్తానని అతనికి తెగేసి చెప్పాడు. ఆమె బావ వద్దని చెప్పాడు. ఇప్పుడు వదిలిపెట్టు అని చెప్పాడు అయినా ఆ మూర్ఖుడు వినకుండా బాలికను చిత్రవధ చేశాడు. ఆ సమయంలో కాపాడమని బాలిక ఆర్తనాదాలు చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వైరల్ ఆడియో టేపు ఇప్పుడు మీడియాకు లభించింది. కొప్పోలు గ్రామంలో ఈనెల 13వ తేదీన మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. ఆ ఘటన రాష్ట్రాన్ని అంత ఒక్క సారి ఆందోళనలో పడేసింది. ఊరు చివర్లో ఉన్న వ్యవసాయ భూముల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక మెడకు చున్ని చుట్టి ఉండటంతో పాటు డెడ్ బాడీ పక్కనే మద్యం బాటిళ్లు పడి ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. కేతే పల్లి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ విషయంలో కేతేపల్లి ఎస్.ఐ రామకృష్ణ విచారణ సరిగ్గా చేయలేదంటూ నిందితుడిని కాపాడాలనే అతని ఈ పని చేశాడని. గ్రామస్తులు,ఇతర దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. ఎస్‌ఐ రామకృష్ణని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశాయి. దాంతో ఎస్‌ఐ రామకృష్ణను విఆర్‌కి అటాచ్ చేస్తూ డిఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ బాలిక పోస్టుమార్టంలో ఆధారాలు తారు మారు చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో డిఐజీ రంగనాథ్ స్పెషల్ ఆపీసర్ సతీష్ ఐపీఎస్‌ను నియమించారు. పోలీసుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్లు తేలింది. దీంతో పవన్, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అమాయకురాలైన బాలికను చంపిన దుండగులను ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.