తెలగాణ బంద్: హరీష్ రావు అరెస్ట్
posted on Jun 15, 2013 @ 11:45AM
ఛలో అసెంబ్లీ సంధర్బంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నివారం తెలగాణ బంద్ జరుగుతోంది. బంద్ సంధర్బంగా సిద్ధిపేట ఆర్టీసి బస్సు డిపో ఎదుట ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా శనివారం తెల్లవారు జామున ఏదుట్ల, రేమద్దెల గ్రామాల మధ్య రెండు ఆర్టీసి బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది.
గద్వాల, అచ్చంపేటల్లో మాత్రం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్లగొండ జిల్లాలో కూడా డిపోల వద్ద బైఠాయించిన తెరాస నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సంఘీభావం తెలుపుతూ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. హుజురాబాద్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా తెరాస నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యాసంస్థలు బంద్‌ను పాటిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిగి డివిజన్‌లో కొందరు వ్యక్తులు బస్సులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించి తెరాస శానససభ్యుడు జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లో ఆందోళనకారులు ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఇదే జిల్లాలోని పానగల్‌లో రెండు ఆర్టీసి బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు.