ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పేంటి! సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకో..
posted on Nov 8, 2021 @ 4:08PM
బీజేపీ దేశ ద్రోహులను తయార చేసే ఫ్యాక్టరీనా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ప్రశ్నించిన వాళ్లను దోశ ద్రోహులకు చిత్రీకరిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దోశ ద్రోహి, అర్భన్ నక్సలైట్ స్టాంప్ వేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెబుతున్నారని మండిపడ్డారు. నేను చైనాలో డబ్బులు దాచుకున్నారా.. సంజయ్ నిరూపిస్తారా అని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. ముందు తన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఆ విషయం తేల్చేవరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్.
కేంద్రం చేస్తున్న దోపిడి దేశ ప్రజలకు తెలియదా అని కేసీఆర్ అన్నారు. తమకు సమస్యలు వచ్చినప్పుడల్లా బీజేపీ కొత్త సమస్యలు స్పష్టిస్తుందన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు అందులో భాగమేనన్నారు. రాయలసీమకు నీళ్లు వద్దని తానెప్పుడు చెప్పలేదన్నారు కేసీఆర్. బేసిన్లు, బేషజాలు లేవన్నారు. ఏపీకి వెళ్లే చేపల పులుసు తింటే తప్పేంటన్నారు. కేంద్ర నిధులపైనా సంజయ్ అసత్యాలు చెబుతున్నారన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ దాడులు చేయడం దేశంలో కామన్ గా మారిందన్నారు.
బీజీపీలా టీఆర్ఎస్ నీచంగా ప్రవర్తించబోదని కేసీఆర్ చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటామని తెలిపారు. ‘‘నేను రాయలసీమకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పిన మాట వాస్తవమే. ఈ రోజు కూడా ఆ మాట చెప్తున్నా. రాయలసీమకు నీళ్లు ఇవ్వొద్దని ఎవరు చెప్తున్నారు? నేను అక్కడికి వెళ్లి చెప్పడం కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, వాళ్ల అధికారులను ఇక్కడికి పిలిపించి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పాను. ‘కృష్ణా నదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్నాయి. మేము గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి.. మీకు మేము సహకరిస్తాం’ అని చెప్పా. రాయలసీమ కరువు ప్రాంతం. వాళ్లకు తప్పకుండా నీళ్లు రావాలి. అది న్యాయం. ఈ నీటి విభేదాలు అంతా కేంద్రం ఆడే డ్రామా. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అంటూ ఎన్నికల కోసం డ్రామాలు ఆడడం పరిపాటి అయిపోయింది.’’ అని కేసీఆర్ అన్నారు.