కేసీఆర్ ఇన్ సింగపూర్
posted on Aug 21, 2014 @ 11:57AM
జీవితంలో మొదటిసారి దేశం దాటి బయటకి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అడుగు పెట్టిన మొదటి విదేశం సింగపూర్‌లో బిజీబిజీగా వున్నారు. బుధవారం ఉదయం సింగపూర్‌కు చేరుకున్న కేసీఆర్ బృందానికి ఐఐఎం పూర్వ విద్యార్థులు స్వాగతం పలికారు. కేసీఆర్ బృందం సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్లో బస చేశారు. ఐఐఎం పూర్వ విద్యార్థులు గురువారం కార్యక్రమం నిర్వహించనున్న స్టేడియాన్ని కెసిఆర్ సందర్శించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హైకమిషనర్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. 23న ఉదయం సింగపూర్ నుంచి కేసీఆర్ కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే ఉండి 24వ తేదీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్ రంజన్, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, ముఖ్యమంత్రి అదనపుకార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌తోపాటు విదేశీ పర్యటనకు వెళ్ళారు.