కేసీఆర్ అభినందనలు అక్కర్లేదు!
posted on Jun 4, 2024 @ 9:21PM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో కేసీఆర్ అర్జెంటుగా చంద్రబాబుకు, పవన్‌కి అభినందనలు తెలియజేశాడు. బీజేపీకి మాత్రం అభినందనలు తెలపలేదు. అసలు ఈయన పనికిరాని అభినందనలు ఎవరిక్కావాలంట? కేసీఆర్ అభినందనలు రిజెక్టెడ్! కడుపులో కత్తులు, పైకి కౌగిలింతలు అంటారు చూశారా.. కేసీఆర్ అభినందనలు కూడా అలాంటివే. కేసీఆర్‌కి ఆంధ్రులంటే మంట.. ఆంధ్రులను తిట్టనిదే ఈ కేసీఆర్‌కి పెగ్గు దిగదు. ఆయన ఫ్యామిలీకి ముద్ద దిగదు. ముఖ్యంగా చంద్రబాబును తిట్టనిదే పూట గడవదు. నిన్నగాక మొన్న రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో సున్నా స్థానాలు పొందిన కేసీఆర్ కడుపు చంద్రబాబు విజయాన్ని చూసి యాసిడ్ పోసినట్టు మండిపో్తూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ని ఎలా నాశనం చేయాలా? చంద్రబాబును ఎలా నాశనం చేయాలా అని నిరంతరం ఆలోచించే కేసీఆర్ ఇప్పుడు సుద్దపూసకి అమ్మ మొగుడిలాగా అభినందనలు చెబితే, మురిసిపోయి థాంక్స్ చెప్పేవారు ఎవరూ లేరిక్కడ.
జగన్ అధికారంలో వున్నంతకాలం వీళ్లిద్దరి మధ్య దోస్తీ బాగా నడిచింది. ఆ జగన్ దరిద్రుడు అమరావతిని సర్వనాశనం చేస్తే, ఈ దరిద్రుడు కేసీఆర్ హైదరాబాద్‌లో కూర్చుని ఎంటర్‌టైన్‌మెంట్ చూశాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఈ పోటుగాడు చేసే దిక్కుమాలిన పాలనను అందరూ ఎత్తిచూపుతారని, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూపుతారని ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలని నిరంతరం కోరుకున్నాడు. కేసీఆర్ దిష్టికళ్ళకు తోడుగా మన అష్ట దరిద్రుడు కూడా కలసి రావడంతో మొత్తం సర్వనాశనమైపోయింది. నాశనమైపోయిన ఆంధ్రప్రదేశ్ ఈ దిక్కుమాలిన కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వస్తువు అయిపోయింది. పక్క రాష్ఠ్రం చూడండి ఎంత దరిద్రంగా తయారైందో.. మన రాష్ట్రం చూడండి ఎంత అద్భుతంగా వుందో అని ఈ కేసీఆర్ కుటుంబం సభ్యులు చేసిన వెటకారాలు మర్చిపోవడానికి ఆంధ్రులు పౌరుషం లేని వాళ్ళు కాదు.. పురాణ కాల నుంచి ఈ భూమ్మీద వున్న జాతి ఆంధ్ర జాతి. అదను చూసి వాత పెట్టడంలో సిద్ధహస్తులు.
చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించి, జలగ జగన్‌తో చేతులు కలిపి కోట్లకు కోట్లు సప్లయ్ చేసి చంద్రబాబు ఓడిపోవడానికి నీవంతు సహకారం అందించి, చంద్రబాబు ఓడిపోయినప్పుడు కేసీఆర్ మాట్లడిన వెటకారం మాటలను ఎవరు మరచిపోగలరు? చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఈయనగారి పుత్రరత్నం చేసిన కామెంట్లను మరచిపోవడం సాధ్యమా?
నిన్నగాక మొన్న ఈయన దారుణంగా ఓడిపోయినప్పుడు తన ఓటమి గురించి ముందు తెలియదు.. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆయన పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో కూడా ఆయనకు తెలియదు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ మళ్ళీ వస్తాడని ఈయనకి తెలుసంట. ఈ మేరకు ఈయనకి ఎవరో సమాచారం ఇచ్చారంట.. సమాచారం ఇచ్చినవాడెవడు? విన్న ఈయన ఎవరు? మీ ఓటమి తప్పించుకోవడం మీవల్ల కాదుగానీ, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో చెప్పే శక్తి మీకుందా? మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చాయి. ఈ ఘోర పరాజయాన్ని కేసీఆర్ ముందే ఊహించాడా? ఇది ఊహించలేని పెద్దమనిషికి ఆంధ్రప్రదేశ్‌లో జయాపజయాల సంగతి ఎందుకంట?
జైల్లో వుండాల్సిన వాళ్ళు బయట వున్నారు... ఇదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి పెద్ద బ్యాడ్‌లక్. ఆల్రెడీ కవితక్కాయ్ జైల్లో వుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావ్ తదితర రాయల్ ఫ్యామిలీ మెంబర్లలందరూ జైల్లో పడతారు. ఇక మా జలగ సంగతి సరేసరి... అవినాష్ రెడ్డితో కలసి జైలుకు వెళ్ళడానికి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి. మీరంతా కలసి ఏ తీహార్ జైల్లోనో ఫ్రెండ్‌షిప్ చేసుకోండి.. మా ఆంధ్రప్రదేశ్ జోలికి.. చంద్రబాబు జోలికి ఫ్రెండ్‌షిప్, అభినందనల పేరుతో కూడా రాకండి..