అందులో కేసీఆర్ పాత్ర: ఎర్రబెల్లి
posted on Apr 1, 2011 @ 3:56PM
హైదరాబాద్: ఇటీవల జరిగిన శాసనసభ్యుల కోటా శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వెనుక ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు హస్తం ఉందని టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అనుమానం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్‌కు విజ్ఞత ఉంటే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ ఎమ్మెల్యేల రాజీనామాను ముందుగా టిఆర్ఎస్ డిమాండ్ చేయాలని అన్నారు. ఒక పార్టీనుండి గెలిచి మరో పార్టీకి ఓటు వేసి నైతిక విలువలు కోల్పోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి వారు మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎజెండా ఓట్లు, సీట్లు, నోట్లు అని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు తాము ఎప్పుడో పోచారంను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. ఆయనపై మొదట అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్‌కు పోచారం దీక్షలో కూర్చునే అర్హత లేదన్నారు.