Read more!

రాజీనామాలో మెలిక పెట్టిన కావూరి

 

 

మంత్రి వర్గంలో చోటు దక్కలేదని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్ లకు అన్యాయం జరుగుతుందని, పార్టీని నమ్ముకుని పనిచేసినా ప్రయోజనం లేదని, అందుకే తాను సీనియర్ల కోసం రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. చివరకు ప్రధాని పిలిచి మాట్లాడిన తాను బెట్టు వీడేది లేదని బీరాలు పోయారు. అమ్మ పిలిచి మాట్లాడితే గాని ఆలోచించను పొమ్మన్నారు. రాజీనామాపై వెనక్కు తగ్గనన్నారు.



అయితే రాజీనామా లేఖలోనే కావూరి లాజిక్కు ఉందని తెలిస్తే మాత్రం మన ఆశ్చర్యపోక తప్పదు. ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎవరూ రాజీనామా లేఖ ఇవ్వని విధంగా కావూరి రాజీనామా లేఖ ఇచ్చారు. అవును లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన జనవరి ఒకటవ తేదీ నుండి రాజీనామా ను ఆమోదించాలని పేర్కొనడం విడ్డూరం. అధిష్టానానికి అంతర్గతంగా చెప్పిన కావూరి ఆ మేరకు జనవరి ఒకటి తుదిగడువు ఇచ్చారేమో. అసలు ఎలాంటి షరతులు లేకుండా రాజీనామా చేస్తేనే అప్పుడు స్పీకర్ సంబంధిత సభ్యుడిని పిలిచి ఓ సారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి రాజీనామాలు చెల్లవు. గతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఇలాగే వరసకట్టి రాజీనామాలు చేశారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించాలంటే కావూరి మరో సారి రాజీనామా చేయక తప్పదు.