Read more!

ఎమర్జెన్సీ అలారం ఎందుకు మోగినట్టు..?

 

జగన్ ఉంటున్న చంచల్ గూడ జైలుకి విజిటర్ల తాకిడి పెరుగుతోంది. చాలామంది విజిటర్లు అనఫిషియల్ గా జైలుకెళ్లి జగన్ ని కలుస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. జైలు అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నారని, జైల్లో జగన్ దగ్గర ఓ సెల్ ఫోన్ కూడా ఉందని టిడిపి నేత యనమల తారా స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. చంచల్ గూడా జైల్లో జగన్ ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు అనే అధికారికి సమాచారాన్ని యనమల సంపాదించారు.

 

ఉన్నట్టుండి చంచల్ గూడ ఎమర్జెన్సీ సైరన్ ఎందుకు మోగిందో తెలుసుకునేందుకు అధికారులు హడావుడిగా పరిగెత్తారు. జైల్లో అంగుళం అంగుళం గాలించి కారణాన్ని వెతికి పట్టుకున్నారు. కానీ.. అది బైటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ .. ఎమర్జెన్సీ అలారం ఎందుకు మోగినట్టు అన్న అనుమానం మాత్రం ఇప్పటికీ జనానికి అలాగే ఉంది.

 

ఈ మధ్యకాలంలో చంచల్ గూడ జైలుకి విఐపిల రాక బాగా పెరిగింది. సెక్యూరిటీని టైట్ చేశారు. అన్ని వైపులా సీసీ కెమెరాలతో కవర్ చేశారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లోకూడా భద్రతని కట్టుదిట్టం చేశారు. సెంట్రీలు కళ్లలో ఒత్తులేసుకుని కాపలా కాస్తున్నారు.. అయినా ఎమర్జెన్సీ అలారం మోగింది..

 

చంచల్ గూడ జైలు జగన్ పార్టీ కార్యాలయంగా మారిందని టిడిపి నేతలు గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు. వైకాపాలో చేరదామనుకున్నవాళ్లంతా నేరుగా జైలుకెళ్లి జగన్ ని కలిసి మాట్లాడొస్తున్నారంటున్నారు. వైఎస్సాఆర్ సీపీ నేతలు మాత్రం జైల్లో జగన్ కి భద్రత లేదని ఆరోపిస్తున్నారు. వేళకాని వేళలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎమర్జెన్సీ అలారం మోగడం దీనికి తార్కాణాలని ఆరోపిస్తున్నారు.