కేటీఆర్‌కు కవిత చెక్!.. పంతంపట్టి ఎమ్మెల్సీ.. నెక్ట్స్ మంత్రి?
posted on Nov 23, 2021 @ 3:13PM
కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి. ఆ కుంపటి.. వేరుకుంపటిగా మారకుండా ఆసక్తికర టర్న్‌లు తీసుకుంటోంది. కేటీఆర్, కవితల మధ్య కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరింది. కవితను దాదాపు దూరం పెట్టేశారు. కవిత సైతం ప్రగతిభవన్‌కు బాగా దూరంగా ఉండిపోయారు. ఆ గ్యాప్ బాగా పెరగడం.. దారం తెగేదాకా లాగుతుండటం.. అసలుకే ఎసరు అనుకున్నారో ఏమో.. ఆ ముగ్గురు కాస్త తగ్గారు. కవిత విషయంలో ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారని అంటున్నారు.
కవితకు ప్రాధాన్యం ఇస్తే ఓకే. కానీ, ఇక్కడ కాదు. రాజ్యసభకు పంపించాలి. ఢిల్లీకి పరిమితం చేయాలి. అంటూ కేటీఆర్ కండీషన్ పెట్టారని తెలుస్తోంది. కొడుకు మాట కాదనలేని కేసీఆర్.. కేటీఆర్‌కు రూట్ క్లియర్ చేసేందుకు కవితను రాజ్యసభ రేసుకు సిద్దం కావాలని చెప్పారట. కానీ, కవిత ఆయన కూతురే కదా.. అతని సోదరే కదా.. అందుకే, ఆమె సైతం అంతే పట్టుదలగా ఉన్నారు. రాజ్యసభ వద్దంటే వద్దు.. రాష్ట్రమే ముద్దు.. అంటూ పంతం పట్టారట. తనను ముఖ్యమంత్రిని చేయమంటే చేయట్లేదు.. అన్నకే అన్నీ ఇచ్చేస్తున్నారు.. పైగా రాష్ట్రంలోనే లేకుండా చేయాలని చూస్తున్నారంటూ.. అంటూ తండ్రి దగ్గర లొల్లిలొల్లి చేసిందట కూతురు.
ఓవైపు గారాల పట్టి. ఇంకోవైపు రాజకీయ వారసుడు. కొడుకు-కూతురు ఆధిపత్య పోరుతో సతమతమైన కేసీఆర్.. చివరాఖరికి మధ్యే మార్గంలో మరో ఆప్షన్‌కు ఒప్పుకున్నారట. తనను రాజ్యసభకు పంపించేయాలనే ఎత్తుగడను కవిత పంతం పట్టి మరీ చిత్తు చేశారట. అప్పటికే నిజామాబాద్ బరి నుంచి ఆకుల లలిత పేరును ఖరారు చేసినా.. ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేయించారట. కూతురు డిమాండ్ మేరకు.. కేసీఆర్ దిగొచ్చి.. కేటీఆర్ వద్దంటున్నా.. కవితనే మరోసారి ఎమ్మెల్సీని చేస్తున్నారు కేసీఆర్.
అయితే, కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా ఇక్కడితో ముగిసిపోలేదు. జస్ట్ ఎమ్మెల్సీతో కవిత కాంప్రమైజ్ కావట్లేదు. మంత్రిని చేసేదాకా వదిలే సమస్య లేదంటున్నారు. త్వరలో జరగబోవు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనను మంత్రిని చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారట కవిత. సీఎం సీటు ఎలాగూ ఇవ్వట్లేదు కాబట్టి.. కనీసం మినిస్టర్‌ను అయినా చేయాల్సిందేనని మొండిపట్టు పడుతున్నారట కవిత. మరి, కూతురు ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గుతారా? త్వరలోనే మంత్రిని కూడా చేస్తారా? లేదంటే, కవిత మినిస్టర్ పోస్ట్‌కు కేటీఆర్ చెక్ పెడతారా? ఏదిఏమైనా కల్వకుంట్ల కుటుంబంలో రాజుకున్న కుంపటి ఇప్పట్లో ఆరిపోయేలా లేదంటున్నారు.