కత్తి మృతి పై కొత్త అనుమానాలు..
posted on Jul 14, 2021 @ 1:51PM
జూన్ 26న నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, రెండు వారలు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది .. జులై 10 తేదీన చనిపోయిన, సినిమా క్రిటిక్, నటుడు, కత్తి మహేష్ మృతిపై, ఇప్పుదు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ఆయన చనిపోయిన వార్త వచ్చిన వెంటనే కూడా కొందరు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్త పరిచారు. కోలుకున్నారు ... రేపో మాపో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్న సమయంలో, ఆయన చనిపోయారని తెలియడంతో సోషల్ మీడియాలో ఆయన సన్నిహితులు కొందరు, ఇంతలోనే ఏమి జరిగింది, ఎలా చని పోయారు? అన్న అనుమానాలను వ్యక్త పరిచారు. అయినా అధికారులు ఎవరూస్పందించలేదు.
సోమవారం చిత్తూరు జిల్లాలోని మహేశ్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ, చికిత్స విషయంలో కాకుండా, అసలు ప్రమాదం జరిగిన తీరు పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్‌కు తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు పోలీసు అధికారులో మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం వలన ఎగిరెళ్ళి గ్లాస్ పడడంతో అద్దాలు పగిలి కంటి సమీపంలో గుచ్చుకున్నాయని వివరణ ఇచ్చారు.సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం వల్లనే ఆయనకు గాయాలయ్యాయని కూడా వివరణ ఇచ్చారు.అలాగే వైద్యులు కూడా కంటికి మాత్రమే గాయమైందని, కన్ను పోయినా ప్రాణహాని లేదని చెప్పినట్లు వార్తలొచ్చాయి. కంటికి ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ సక్సెస్ అన్న వార్తలూ వచ్చాయి.
మంద కృష్ణ మాదిగ కత్తి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో ఏపీ ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించింది. విచారణకు ఆదేశించింది. పోలీసులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు.ప్రాధమిక విచారణ ప్రారంభించారు.మహేశ్ కారు డ్రైవర్ సురేష్‌ను విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపై పోలీసులు డ్రైవర్’ ను విచారించినట్లు సమాచరం. ఆలాగే, ఇతర కోణాల్లోనూ విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.
అలాగే మంద కృష్ణ మాదిగ అన్నట్లుగా, కత్తి మహేష్’ కు అనేక మంది శత్రువులుండే అవకాశం లేక పోలేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై తెలంగాణ ప్రభుత్వం, 2018లో ఆరు నెలల పాటు నగర బహిష్కరణ శిక్ష విధించింది.చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి పంపివేసింది. అప్పట్లో ఆయన హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని అవమానించే విధంగా అవహేళన చేస్తూ చేసిన ప్రసంగం ఇప్పటికీ వైరల్ అవుతూనే వుంది. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరినప్పుడు, చివరకు చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విపరీత వ్యాఖ్యలు చేశారు.
కత్తి మహేష్’ శ్రీరాముని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ హీరోల మీద అదుపు తప్పిన విమర్శలు చేశారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కత్తి మహేష్’ విపరీతంగా ట్రోల్ చేశారు ..అలాగే, కత్తి ఫాన్స్ కూడా ఎదురు దాడి చేశారు. మీడియాలోనూ చాలా పెద్ద ఎత్తున చర్చల రచ్చ జరిగింది. ఈ నేపధ్యంలో ఆయనకు శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, అసలు ఏమి జరిగింది, కత్తి మహేష్ ఎలా కన్ను మూశారు? అనేది మాత్రం విచారణలో గానీ, తేలదు.