రాయచూర్ రొచ్చులో కేటీఆర్.. కర్ణాటక వార్నింగ్
posted on Oct 12, 2021 @ 4:36PM
రాజకీయ నాయకులకు ఏమున్నా లేక పోయినా ఓకే, కానీ సెల్ఫ్ ప్రమోషన్ లేక పోయినా సొంత డబ్బా కొట్టుకోవడం చేతకాక పోయినా ఈ రంగంలో రాణించలేరు. అందుకే బతకనేర్చిన రాజకీయ నాయకులు, చారాణా కోడికి బారాణా మసాల’ అన్నట్లుగా,ఉన్నవీ లేనివీ అన్నీ కలిపేసుకుని, గొప్పలకు పోతుంటారు. ఈవిషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే ఘనుడు, అనుకుంటే, ఆయనకంటే ఘనుడు సన్ అఫ్ కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు, ఆయన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఫాలోయర్స్.
ఎందుకన్నారో, ఏ సందర్భంలో అన్నారో ఏమో కానీ, కర్ణాటక శాసన సభలో రాయచూర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే, శివరాజ్ పాటిల్ తెలంగాణ సరిహద్దుల్లోని రాయచూర్ జిల్లాను, తెలంగాణలో విలీనం చేయాలని, అన్నారు...ట. ఆయన మాటలను ఇంకెవరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మంత్రి కేటీఆర్ వాల్ మీద వాలింది. ఇంకేముంది కేటీఆర్ రెచ్చి పోయారు... చూశారా ..చూశారా... తెలంగాణ గొప్పదం కేసీఆర్ ఘనకీర్తి, రాష్ట్రం సరిహద్దులు దాటి దిగంతాలకు పాకి పోతోందని ... ట్వీటారు. అంతే కాదు, “తెలంగాణ ఖ్యాతి సరిహద్దులుదాటింది. కర్ణటకలోని రాయచూర్ ఎమ్మేల్యే శివరాజ్ రాయచూర్ జిల్లాను, తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. ఆమాటకు ప్రజలంతా చప్పట్లతో ఆయన సూచనను స్వాగతించారు” అంటూ ట్వీటారు కేటీఅర్.
అంతటితోనూ కథ అయిపోలేదు. అక్కడి నుంచి అస్మదీయ పత్రికలు అందుకుని, గతమలో ఎప్పుడో మహారాష్ట్ర సరహద్దు గ్రామాల ప్రజలు, ఇలగే తెలంగాణలో కలిసిపోతమని, నాందేడ్ కలెక్టర్’కు వినతి పత్రం సమర్పించారని, ఈనాటికి అసలు కారణం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు, రెండు కాళ్లుగా ప్రగతిశీల రాష్ట్రంగా పరుగులు తీయడమే అని, కథనాలు ఆల్లేశాయి.
అయితే, సరిహాద్దు దాటి, ఆ వైపుకు వెళితే ... అలాంటి ముఖ్యమంత్రి మంత్రి కార్యాలయం మొదలు అధికార బీజేపీ రాష్ట్ర నాయకుల వరకూ ఏ ఒక్కరూ కూడా అలాంటి ముచ్చట ఏదీ తమ దృష్టికే రాలేదని, కర్ణాటకలో మీడియాలో ఇక్కడా కూడా అలాంటి వార్త రాలేదని, తెలుగు వన్ కు తెలిపారు.
రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే, శివరాజ్ పాటిల్ తెలంగాణలో కలిసిపోతామని అన్నదే నిజమైతే, ఆయన నుంచి వివరణ కోరతామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముఖ్యమంత్రి పీఆర్వో తెలుగు వన్ తో ఫోన్లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కర్ణాటకలోని ఏ ప్రాంతాని పొరుగు రాష్ట్రంలో విలీనం చేసే ప్రశ్నే లేదని స్పష్తం చేశారు.
అలాగే, రాయచూర్ సహా మరో మూడు జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన, కళ్యాణ్ కర్ణాటక ప్రాంత అభివుద్ధి మండలి చైర్మన్, గుల్బర్గా ఎమ్మెల్యే దత్తాత్రేయ సి.పాటిల్, రాయచూరు ఇంచార్జి మంత్రి, హలప్పా ఆచార్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, నళినీ కుమార్ కటీల్ తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారు, తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, పొరుగు రాష్ట్రం ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కళ్యాణ్ కర్ణాటక ప్రాంత అభివుద్ధి మండలి చైర్మన్, గుల్బర్గా ఎమ్మెల్యే దత్తాత్రేయ సి.పాటిల్ తమ ప్రాంత ప్రజలు ఎవరూ, కనడ ఆత్మ గౌరవాన్ని వదులుకుని, తెలంగాణ విలీనం కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం,ఇరుగు పొరుగు రాష్ట్రలను అవమానించడం మంచిది కాదని, తెలంగాణ నాయకులకు ఆయన హితవు పలికారు. ఇక ముందు ఇలాంటి వివాదాలు సృష్టించి రాష్ట్రల మధ్య చిచ్చుపెట్టద్దని అన్నారు.
ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన రాయచూర్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్’కు ఎటు నుంచి ఏ షాక్ తగిలిందో ఏమో కానీ, తెలుగు వన్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోనుకు చిక్కడంలేదు. సోమవారం ఉదయం ఒక్క సారి ఫోన్’లో హలో అన్న ఆయన మీటింగ్’ లో ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు .. ఇక ఆ తర్వాత ఫోన్ ఎత్తకుండానే తప్పించుకుంటున్నారు. ఇలా చిల్లర రాజకీయాలు చేయడం .. ఇరుగు పొరుగు రాష్ట్రాలను కించపరిచే విధంగా వక్రభాష్యం చెప్పడం రాజకీయ నాయకులకే కాదు, మీడియా కూడా మంచింది కాదని, తమ పాలన పట్ల అంత విశ్వాసం ఉంటే కర్ణాటకలో తెరాస పోటీయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నాఋ. నిజానికి తెలంగాణలో పరిస్థితి, అంట గొప్పగా ఏమీలేదని, ఇంటి పేరు శొంటివారు ..ఇంట్లో గబ్బిల్లాలకంపు అన్నట్లుగా, తెలంగాణలో పరిస్థితులున్నాయని అంటున్నారు.