టీచర్లకు జన సమీకరణ బాధ్యతలు! జగన్ బాటలో కేసీఆర్ సర్కార్ విడ్డూరం..
posted on Aug 14, 2021 @ 4:16PM
ముఖ్యమంత్రి అంటే చాలా ఎంతో ప్రాముఖ్యం ఉన్న తరహాలో ఆలోచించి, నిర్ణయాలు అమలు చేస్తాడని అంతా ఆలోచిస్తారు. మంత్రివర్గంలో ముఖ్యమైనవాడు కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రి అన్నారు. కానీ... తెలంగాణ సీఎం అయినా, ఏపీ సీఎం అయినా ఇద్దరూ ఇంత వరస్ట్ గా ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కాక తెలుగు ప్రజలంతా తలలు పట్టుకుంటుున్నారు.
ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఏపీ సీఎం జగన్.. వైన్స్ షాపుల ముందు ప్రభుత్వ టీచర్లు విధులు నిర్వహించేలా ఆర్డర్లు పాస్ చేసి అభాసుపాలయ్యారు. ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పౌర సమాజం నుంంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అదే ఒరవడిని ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా పాటిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముంగిట ఆయనకు బుర్ర చెడిందా.. లేక బుర్ర ఉన్నవాళ్ల సలహా తీసుకోవడం లేదా తెలీదు కానీ... ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం కేసీఆర్ పరిపాలనను నవ్వులపాలు చేస్తోంది.
ఈ నెల 16న దళితబంధు స్కీము ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ వెళ్తున్నారు. అక్కడ భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఎంతో ఘనంగా అక్కడే ఆ పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని డీఈవో నుంచి టీచర్లకు, ఎంఈవోలు, జీహెచ్ఎంలకు ఆదేశాలు అందాయి. జన సమీకరణ బాధ్యత వీరిదేనని జిల్లా విద్యాధికారే చెప్పడంతో ఎడ్యుకేషన్ స్టాఫంతాా ఆ కసరత్తులో తలమునకలై ఉన్నారు. వీరంతా స్పెషల్ ఆఫీసర్లుగా ఉంటూ.. స్థానికంగా కోఆర్డినేటర్లను నియమించుకోవాలని, వారి ద్వారా జనసమీకరణ, సభ ఏర్పాట్ల పనులు పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలని ఆదేశాలు అందడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దళిత బంధు ప్రభుత్వ పథకమైనా... హుజూరాబాద్ ఉపఎన్నిక అనేది పార్టీ వ్యవహారం కాబట్టి.... ఒక పార్టీకి ఉపయోగపడేలా ప్రభుత్వ స్టాఫ్ ను ఎలా వాడుకుంటారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రైవేటు కూలీలను పెట్టి పని పూర్తి చేయించుకోవాలే తప్ప... ఖజానాలో డబ్బు లేదని ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులను రాజకీయ సభలకు వాడుకోవడం సరికాదని, దీనివల్ల పిల్లల ముందు ఉపాధ్యాయులు నైతికంగా దిగజారిపోతారన్న వ్యాఖానాలు వినిపిస్తున్నాయి. మరి జగన్ లాగే కేసీఆర్ ఈ నిర్ణయం మీద వెనుకడుగు వేస్తారా.. చూడాలి మరి.