కన్నడ నటి హేమశ్రీని హత్య చేశారా?
posted on Oct 11, 2012 @ 10:39AM
కన్నడనటి హేమశ్రీ మృతిపై అనుమానాలు బలపడుతున్నాయ్. హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ఆరు గంటలముందే ఆమె చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు పోలీసులకు సమాచారమందించారు. పోస్టమార్టం రిపోర్ట్ లో హేమశ్రీ తలమీద, చెక్కిళ్లమీద, పక్కటెముకలమీద బలమైన గాయాలున్న విషయం బైటపడింది. హేమశ్రీ భర్తే ఆమెని హత్యచేసి ఆరోగ్యం బాలేక చనిపోయిందంటూ డ్రామా చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె సన్నిహితులు ఆరోపిస్తున్నారు. అసలు హేమశ్రీకి అంత ముంచుకొచ్చే అనారోగ్యమేదీ లేదని చెబుతున్నారు.