పరీక్ష రాస్తుండగానే ప్రాణం పోయింది
posted on Mar 12, 2015 @ 12:22PM
పరీక్ష రాస్తూ ఓ విద్యార్ధి గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకొంది. కె. వెంకటేశ్వర్లు అనే యువకుడు కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రం గీతాంజలి పాఠశాలకు చేరుకున్నాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది వెంకటేశ్వర్లును స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే వెంకటేశ్వర్లుకు గతంలోనే హార్ట్ ప్రాబ్లమ్ ఉందని దానివల్లే మృతి చెందివుండవచ్చని తోటి విద్యార్ధులు తెలిపారు.