జగనాసురుడి ఆట కట్టించాలంటే...?!
posted on Aug 2, 2024 @ 1:38PM
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
గడచిన ఐదేళ్ళ జగన్ విధ్వంసక పాలనలో ఆయన తరచూ చెప్పిన మాటలు... విలువలు, విశ్వ‘ష’నీయత, అవినీతి రహిత పాలన, కులవివక్ష లేకుండా పక్షపాతం లేని పాలన! పేదవాళ్ళకు పెత్తందార్లకు మధ్య యుద్ధం... దుష్టచతుష్టయం! ఇలా ఐదేళ్ళు కాలకూట విష సర్పానికి చిక్కిన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. దేశంలో ఎక్కడా జరగని రాజ్యహింస ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. బడుగు బలహీన వర్గాల జీవితాలు ఛిద్రం అయ్యాయి! అబ్దుల్ సలాం లాంటి పేద కుటుంబం నిండు ప్రాణాలు వికృత పాలెగాడి పోలీసు దమనకాండకు గాల్లో కలిసిపోయాయి! దళితులపై జరిగిన అకృత్యాలకు అంతే లేదు! శిరోముండనం దగ్గర నుండి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసే వరకు నిరాటంకంగా కొనసాగింది. పెద్దిరెడ్డి రాజ్యంలో దురాగతాలు చెప్పడానికి ఇక్కడ సమయం సరిపోదు! దళిత జడ్జి రామకృష్ణకు అంతులేని వేధింపులు. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుండి పరారయ్యారు! ఇంత చేసిన జగన్రెడ్డి జాతీయ స్థాయిలో ఇష్యూ చేస్తున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక డార్క్ సీక్రెట్ ఉంటుంది! జగన్ ఏం చేసినా కచ్చితంగా ఒక పథకం ప్రకారం అడుగులు వేస్తారు. రాష్ట్రాన్ని అల్లరి చేయాలి! జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపించాలి! నేను అనేవాణ్ణి ఒకణ్ణి ఉన్నాను, ఎక్కడికీ వెళ్ళలేదు అని ఈ రాష్ట్రం వైపు చూసే పారిశ్రామికవేత్తలకు వార్నింగ్ ఇవ్వడం మొదటిది! జస్ట్ 100 కోట్ల లిక్కర్ స్కామ్‌కే... ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సహా కేసీఆర్ కూతురు నెలల తరబడి ఊచలు లెక్కెడుతున్నారు!! మరి జగన్‌ను రక్షిస్తున్నది ఎవరు?
జగన్ రెడ్డి ముడ్డి క్రింద 32 పాత కేసులు..! కొత్తగా ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్.లో బయట పడబోయే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు. ఈ దశలో ప్రజల దృష్టి మరల్చి రచ్చ రచ్చ చేయాలి! కేసులు నమోదయితే రాజకీయ కక్షసాధింపు అని నానా యాగి చేయ్యచ్చు. క్రూరమైన ఆలోచనలు కలిగిన జగన్ ఆంధ్రుల పాలిట ఒక శాపం! కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ ఏనాడో చెప్పారు ఏపీకి పొంచివున్న ప్రళయం జగన్ రెడ్డి అని! గడిచిన ఐదేళ్ళ ఉప్పెన చూసారు కదా! కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర కూడా కాకుండానే జాతీయస్థాయిలో గోలగోల చేస్తూ ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. టీడీపీ, జనసేన జగన్ రెడ్డిని ఏదో ట్రోల్ మెటీరియల్ కింద చూస్తున్నారు. కానీ... అదొక నటోరియస్ క్రిమినల్ మైండ్ సెట్ అని తెలుసుకోలేకపోతున్నారు. మళ్లీ జగన్ వేళ్ళూనుకుంటే... వైఎస్సార్సీపీ ఊపిరి పోసుకుంటే అనే ఆలోచనే... పారిశ్రామికవేత్తల వెన్నులోంచి వణుకు పుట్టిస్తోంది! మరి రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం వుంది . జగన్మోహన్ రెడ్డి కానీ, అతని అనుచరులకు గానీ, నాయకులకు గానీ వారి ప్రభుత్వం పోయిందన్న భయం ఎక్కడ లేదు..! అదే అబద్దాలు.. అవే సాక్షి విషపు రాతలు.. అవే కల్పితాలు.. అవేకట్టు కథలు.. అదే హింస..! ఆఫీసుల్లో ఫైల్స్ తగలబెట్టే స్థాయిలో అధికారులు ఉన్నారు అంటే? ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు స్లీపర్ సెల్స్.లాగా రాష్ట్రం మొత్తం సెక్రటేరియట్ నుంచి సీఎంఓ వరకు మంత్రుల కార్యాలయాల్లోకి చొచ్చుకొచ్చారనేది పచ్చి నిజం.
తెలుగుదేశం పార్టీ , నితీష్ కుమార్ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. అయినప్పటికి జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సాక్షిపత్రికలో భారతి రెడ్డి ఎలా బరితెగించి ప్రవర్తిస్తున్నారు? ఎవరి అండతో వీరంతా రెచ్చిపోతున్నారు? సాయిరెడ్డి కోరగానే అమిత్ షా అపాయింట్ ఇస్తారు. పార్లమెంట్‌లో ఎన్డీయే బిల్లులకు మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది అని బీజేపీ పెద్దలతో టచ్‌లో వుంటారు! అదే సమయంలో డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్‌లో వుండటం... దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యపడని రాజనీతి జగన్ సొంతం! జగన్ రాజనీతిలో నీతి మాత్రం వుండదు జగన్ రాజకీయ అవినీతి ద్వారా సంపాదించిన లక్షల కోట్ల బ్లాక్ మనీ నోట్ల సంచులతో ఢిల్లీ పెద్దలను కొడుతుంటే వారు కాదని ఎలా అనగలరు? నేటి రాజకీయంలో అవినీతి మరకలేని పార్టీ ఒక్కటి అంటే ఒక్కటి అయినా ఉందా?
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన విషయనికి వస్తే రాష్ట్రానికి ఆర్థిక జవసత్వాలు ఎలా సమకూర్చాలి? పెట్టుబడులు ఎలా తీసుకురావాలి? ఈ రాష్ట్రాన్ని సన్ రైజ్ స్టేట్‌గా ఎలా ముందుకు తీసుకెళ్లాలి! అమరావతి, పోలవరం బృహత్ ప్రణాళికతో ఎలా పరుగులు పెట్టించాలి? లా అండ్ ఆర్డర్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? అనే విషయంలో చంద్రబాబుపై ఎవరికీ ఏ విధమైన అపోహలు, భిన్నాభిప్రాయాలు లేవు. ఇవన్నీ ఆయన మాత్రమే చేయగలరు అని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితం వేరు! గడచిన ఈ ఐదేళ్ళ జగన్ పాలన వేరు. సంప్రదాయ రాజకీయ ముఖ చిత్రాన్ని జగన్ పాలన సమూలంగా మార్చివేసింది. మీకు ఊహ తెలిసాక ఎంతో మంది ముఖ్యమంత్రులను, ప్రధానులను చూసి వుంటారు! జగన్ పాలన ధోరణి గతంలో మనం ఎన్నడూ చూడలేదు! ఈ పరిస్థితికి కారణం ఏంటి? వ్యవస్థల విధ్వంసం... అధికారులను పాలేర్లను చేసి తన గొడ్ల చావిడిలో కట్టేయటం! రూల్ ఆఫ్ లా పూర్తిగా పక్కన పెట్టేసి రెడ్డి గారికి పాచి పని చేయటంలో పోటీ పడటం! మరి ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రా ప్రజలకు ఏంకావాలి? కూటమి పార్టీల కార్యకర్తల ఆకాంక్షలు ఏంటి?
ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయటంలో చంద్రబాబు విజన్ ఎంత అవసరమో అదే సమయంలో ఏకకాలంలో నేరచరిత్ర ఉన్న అధికారుల పోస్టింగ్ విషయంలో జగ్రత్తలు
తీసుకోవటం కూడా అంతే అవసరి. అయితే ఈ విషయంలో చంద్రబాబు సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చంద్రబాబు తన సొంత మనుషులని కొంతమందిని నమ్మి పక్కన పెట్టుకోవాలి..! అన్నీ చంద్రబాబు చేయాలంటే సాధ్యపడే పని కానే కాదు..! జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు జగన్ కోసం ప్రాణమిచ్చే నాయకులు బోలెడు మంది ఉన్నారు! అదే చంద్రబాబు విషయంలో అలా ఉందా? చంద్రబాబు కోసం ప్రాణాలకు ఇచ్చే నాయకులు ఆ పార్టీలో ఉన్నారా? నాకు తెలిసి లేరు! కానీ, టీడీపీలో చంద్రబాబు కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు. చంద్రబాబు గత కొన్ని రోజులుగా శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ పోతున్నారు. అదొక పద్ధతి అదొక విధానం..! జనానికి కూటమి కార్యకర్తలకు కావాల్సింది శ్వేత పత్రాలు కాదు యాక్షన్..! ఒకపక్క చంద్రబాబు నాయుడు మార్కు పాలన కొనసాగిస్తూనే మరొకపక్క పవన్ కళ్యాణ్ లోకేష్ నేతృత్వంలో పక్కా ప్రణాళికతో ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక తప్పుడు అధికారిని తప్పుడుపనులు చేసిన రాజకీయ నాయకుడిని శిక్షిస్తున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలి!
ఐదు సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని అంధకారం చేసి విధ్వంసానికి పాల్పడ్డ వాళ్లలో ఒక్కళ్ళలోనైనా భయం అనేది మచ్చుకైనా కనిపిస్తోందా..? అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌కు కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. కృష్ణాకు కొత్తగా వచ్చిన ఎస్సీ గంగాధర్.. మాజీ మంత్రి కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎస్సీ ఇటీవల గుడివాడ వచ్చి రాత్రంతా అక్కడే గడిపారంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని.. అంగళ్లు ఘటనను గుర్తుచేశారు. గంగాధర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడే టీడీపీ నేతలు, శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగారని వివరించారు. దీంతో “వైకాపా వీర విధేయుడని తెలిసీ ఆయనకు జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం విచిత్రంగా ఉంది” అంటూ పలువురు ఎమ్మెల్యేలు అనుకోవడం వినిపించింది.
కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై గుర్తుతెలియని వ్యక్తులెవరో ఇటీవల దాడి చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ ఈ నెల 17న కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్.. ఆ వెంటనే గుడివాడ వచ్చి లక్ష్మోజీని పరామర్శించారు. దగ్గరుండి మరీ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నెలన్నర క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నత్తనడకతో వైసీపీ అధికారులు జారుకొంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పలువురు అధికారులు.. ఐదేళ్లూ ఇష్టా రాజ్యం వ్యవహరించి, ప్రభుత్వం మారగానే ఇక్కడే పాగా వేయటం నిత్యకృత్యం అయింది! కొంతమంది చీకూచింతా లేకుండా హాయిగా కేంద్ర సేవలకు తిరిగి వెళ్ళిపోతారు. పన్నుల శాఖలో డిప్యుటేషన్‌పై వచ్చి పనిచేసి ఇటీవలే ఒక రెడ్డి చెప్పకుండా వెళ్లి పోతే, తాజాగా ఐ అండ్ పీఆర్ మాజీ కమీషనర్ విజయ్‌కుమార్ రెడ్డి కలకత్తాలో తేలారు. అక్కడ రీజినల్ పీఐబీ ఇంచార్జిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఏపీలో ఐదేళ్లపాటు పని చేసిన ఆయన హయాంలో సమాచార శాఖలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆధారాలతో పాత్రికేయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్ర సర్వీసు అధికారులు తిరిగి వెళ్ళరాదంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఈ మేరకు ప్రభుత్వం నోట్ కూడా విడుదల చేసింది. ఏమైందో తెలీదు కానీ ఏపీలో ఏకపక్షంగా, అడ్డగోలుగా వ్యవహరించిన విజయ్ కుమార్ రెడ్డి రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిదానంగా వ్యహారిస్తుండటం ఇదే అదనుగా అధికారులు జారుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కె.ఎస్.జవహర్ రెడ్డి, జగన్ ప్రభుత్వంలో దాదాపు ప్రతి అవినీతి, అక్రమానికీ ఏదో రూపంలో లింకున్న ధనుంజయ్ రెడ్డి, టీటీడీ పవిత్రతను దెబ్బతీసి కేవలం జగన్ కేసుల లాబీయింగ్ కోసమే పనిచేసిన ధర్మారెడ్డి పదవీ విరమణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరోవైపు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ‘‘మధుసూదన్‌రావూ’’ అంటూ పోలీసులను బెదిరించడాన్ని జనం చూశారు.
ఐదేళ్ల క్రితం జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు జాస్తి కిశోర్ లాంటి నిప్పులాంటి వారిని మాతృశాఖకు రిలీవ్ చేయలేదు. ఆరోపణలు లేని వారిని ఎందుకు పెట్టుకున్నారని కేంద్రం గట్టిగా అడిగితే, అప్పుడు పంపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా కేంద్ర సర్వీసుల అధికారులు తిరిగి వెళ్లిపోతుంటే ఏమి జరుగుతుంది.? లేదా సమాచారం ఇచ్చి అనుమతితోనే వెళుతుంటే ఏమి సంకేతం ఇస్తున్నట్లు.? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. చంద్రబాబును సుపరిపాలనకు వదిలేయండి పవన్ కళ్యాణ్, లోకేష్ బాధిత ప్రజలు కూటమి కార్యకర్తల ఆకాంక్షల కోసం తక్షణం పని ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. ఇది జరగాలంటే గతంలో నిజాయితీగా పనిచేసి, జగన్ దాష్టీకాన్ని ఎదుర్కొన్న అధికారులు, విలువలే ఊపిరిగా బ్రతికే వ్యక్తులను నమ్మి భాధ్యతలు అప్పచెప్పాలి.