శశికళ సంస్థల్లో ఈడీ సోదాలు

 

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్త్నె, హైదరాబాద్‌లోని 10 చోట్ల తనిఖీలు నిర్వహించింది. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. జీఆర్‌కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులను రూ.200 కోట్లకు మోసం చేశారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. కనీసం పది స్థలాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్‌ఎ నిబంధనల కింద దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 

ఈ దర్యాప్తు రూ.200 కోట్ల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించినదని, దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు కీలక నగరాల్లో ఈడీ చేసిన సోదాలపై మాత్రం అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ కేసు ఆధారంగా, నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో శశికళతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు. 

జగన్ జన్మదినం సందర్భంగా పశుబలి

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా వైసీపీయులు చేసేది అరాచకమే అన్నది మరో సారి రుజువైంది.  రప్పా.. రప్పా.. గంగమ్మ జాతర అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగానూ హంగామా చేశారు. మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసి తమ అరాచకానికి హద్దులు అంటూ లేవని మరోసారి నిరూపించుకున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో  ఆదివారం (డిసెంబర్ 21) వీరంగం సృష్టించారు. సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డి  ఆధ్వర్యంలో  ఐదు గొర్రెలను  నరికి, వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.  మండల కేంద్రమైన విడపనకల్లు లోనూ అదే తంతు కొనసాగింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ్‌ బాలరాజు, నాయకులు కలసి మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.   మరోవైపు జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుమ్మలకర్ర గ్రామానికి చెందిన మన్నెపల్లి దినేష్‌ ఈ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ తెలుగుదేశం  శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించి దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

కూలిపోతున్న మస్క్ ఉపగ్రహం

ఎలాన్ మస్క్ కు చెందిన  స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహం కక్ష్య నుంచి అదుపుతప్పి భూమి వైపు దూసుకొస్తోంది. సాంకేతిక లోపం  కారణంగా ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని స్పెస్ ఎక్స్ ధృవీకరించింది. అయితే ఈ శాటిలైట్ భూమిపై కూలి పోవడం వల్ల స్పేస్ ఎక్స్ కు కానీ, భూమికి కానీ ఎటువంటి ప్రమాదం, ముప్పు వాటిల్లదని క్లారిటీ ఇచ్చింది. టెస్లా అధినేత  ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి డిసెంబరు 17న సాంకేతిక లోపం కారణంగా అదుపు తప్పి కూలిపోవడం ప్రారంభించింది. వారం రోజుల్లోగా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుంది.  ఈ కూలిపోతున్న  స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

రోహిత్, కోహ్లీ సరసన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టి20లలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన టి20 మ్యాచ్ లో పాతిక పరుగులు చేసిన స్మృతి మంధాన ఈ రికార్డు సృష్టించింది. మొత్తంగా టి20 ఫార్మట్ లో నాలుగువేల పరుగుల క్లబ్ లో చేరిన రెండో మహిళా క్రికెటర్ గా నిలిచింది.  న్యూజిలాండ్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.   స్మృతి మంధానా  154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి.  మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలను పరిగణనలోనికి తీసుకుంటే ఇంత వరకూ స్మృతి మంధానాతో కలిసి  ఐదుగురు మాత్రమే ఈ ఫార్మట్లో నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటారు. ఇండియా నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వారి సరసన స్మృతి మంధానా చేరింది.  ఈ ముగ్గురూ కాకుండా బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం మాత్రమే ఈ ఫార్మట్ లో నాలుగువేలు అంతకు మించి పరుగులు చేశారు. ఇలా ఉండగా ఈ జాబితాలో అందరి కంటే పిన్న వియస్కురాలు స్మృతి మంధానా మాత్రమే కావడం గమనార్హం.  

గిల్‌ను తప్పిస్తున్నట్లు ముందే చెప్పారా?

  టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును శనివారం ప్రకటించారు. ఇందులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత టీమిండియా టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల కెప్టెన్, టీ20 వైస్ కెప్టెన్.. గిల్‌ను స్టాండ్ బైగా కూడా సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం క్రికెట్ పండితులు కూడా ఊహించలేదు. గిల్ కూడా న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచ కప్‌లో ఆడేందకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.  అయితే తనపై వేటు పడుతుందని గిల్‌కు ముందే తెలుసు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కుడి పాదానికి గాయం అవ్వడంతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టీ20లకు గిల్ జట్టులో లేడు. శనివారం అహ్మదాబాద్‌ను వీడి చండీగఢ్‌కు బయల్దేరిన సమయంలో సెలక్షన్ కమిటీ భేటీ జరిగింది. జట్టును ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందే బీసీసీఐ నుంచి గిల్‌కి ఫోన్ వచ్చింది. తనను జట్టులోంచి తప్పించిన విషయాన్ని చెప్పారు.  ఈ విషయాన్ని క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే గిల్‌కు ఎవరు ఈ విషయం గురించి చెప్పారనే అంశం మాత్రం బయటకు రాలేదు. గిల్‌ తొలుత గాయంతోనే దక్షిణాఫ్రికాతో టీ20 ఆడేందుకు సిద్ధపడ్డాడు. కానీ మైదానంలోకి దిగితే అది మరింత తీవ్రమై కీలక టోర్నమెంట్లకు దూరం కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాతే బీసీసీఐ కూడా అతడికి గాయమైన విషయాన్ని ధ్రువీకరించింది. లఖ్‌నవూలో డిసెంబర్‌ 16న నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో గిల్ గాయపడ్డాడు. దీంతో జట్టులో ఆడేందుకు సంజుకు అవకాశం లభించింది.  

సర్పంచ్ తండ్రి కోసం కొడుకు బిక్షాటన

  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని 'బిచ్చగాడు సినిమా తరహాలో ప్రతిన బూనాడో కుమారుడు.  రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఎం.రామకృష్ణయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు.  ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు భాస్కర్.. తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే.. భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే.. తన తండ్రి సర్పంచ్ అయ్యారు. మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి.. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి వెళ్లాడు. ఈ ఘటనపై జే.లింగాపూర్ గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపై గల కుమారుడికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ మాయం.. ట్రాంప్ ఫొటో సహా

  ఎప్‌స్టీన్‌ తాజాగా విడుదల చేసింది, అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్స్ వంటి ప్రముఖుల ఫోటోలున్నాయి. అవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని ఫైళ్లు మాయమవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాయమైన 468 నెంబరు ఫైళ్లలో ట్రంప్‌తో పాటు మెలానియా, ఎప్‌స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ ఫొటోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఫొటోలలో కేవలం నేరగాళ్లే కాకుండా.. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం విస్తుగొలుపుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత భాషావేత్త నోవమ్ చోమ్స్కీ , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లాంటి వారు ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు.  గతంలోనే వీరికి ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ తాజా చిత్రాలు ఆ బంధాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి.  ఫొటోలతో పాటు కొన్ని కీలకమైన చాటింగ్ స్క్రీన్ షాట్ లను కూడా కమిటీ బయటపెట్టింది. అందులో ‘నేను ఇప్పుడే అమ్మాయిలను పంపుతున్నాను’ అనే అర్థం వచ్చే సందేశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఎప్ స్టీన్ నడిపిన అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్ పోర్టుల కాపీలు కూడా అక్కడ లభ్యమయ్యాయి.  అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మహిళల పేర్లను వివరాలను అధికారులు బ్లర్ చేశారు. తూర్పు యూరప్ దేశాల నుంచి యువతులను ప్రలోభ పెట్టి అమెరికాకు రప్పించి వారిని ప్రముఖుల కోసం వినిగించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. వాటితో పాటు ఎప్‌స్టీన్  కథనం ప్రకారం బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మోమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు సమాచారం.  అయితే వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? అనుకోకుండా జరిగిందా? అనే విషయాన్ని న్యాయశాఖ స్పష్టం చేయలేదు. అదృశ్యమైన ఫైళ్ల విషయం బహిర్గతం అవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.  హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలార్నీ జనరల్ పామ్ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ‘ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికన్ ప్రజలకు , మాకు పారదర్శకత అవసరం’ అని ఎక్స్‌లో ఓ పోస్టులో రాసుకొచ్చారు.

శేషాచలం అడవుల్లో దివ్య ఔషధ వనం

  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు జీవనాడిగా దివ్య ఔషధ వనం అభివృద్ధి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సంకల్పించింది. ఔషధ మొక్కలను సంరక్షిస్తూ, ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పడనుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ తరహాలో రూపొందనున్న ఈ ఔషధ వనం భక్తులు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తి–విజ్ఞానం–ప్రకృతి సమ్మేళనం టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతు వనం, విశిష్ట వృక్ష వనం, ఔషధ మొక్కలు వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా, ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి. రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటు తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచి, భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలిపింది.