రేపటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు
posted on Jul 18, 2024 @ 11:14AM
ఎపిలో గత సార్వత్రిక ఎన్నికల్లో వందశాతం స్ట్రయిక్ రేట్ తో గెలిచిన పార్టీ జనసేన. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన గెలిచింది. జనసేన గెలుపు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ప్రస్తుతం 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. తాజాగా, 9 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా రేపటి నుంచి కొత్త సభ్యత్వాల నమోదు చేపట్టనున్నారు. జులై 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది.
క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికీ ప్రమాద, జీవిత బీమా కూడా అందించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో... కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేపట్టనున్నారు.గతంలో సభ్యత్వాల నమోదుకు 15 మంది జనసేన పార్టీ వాలంటీర్లకు మాత్రమే లాగిన్ ఐడీ ఇచ్చేవాళ్లు. ఈసారి 50 మంది జనసేన పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇస్తున్నారు.