కేసీఆర్ ను టార్గెట్ చేసిన జై భీమ్ చంద్రు.. ఏమన్నారంటే?
posted on Dec 19, 2021 @ 2:24PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జై భీమ్ ఫేమ్ జస్టిస్ చంద్రు.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పాలన, కేసీఆర్ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్‌ని హెచ్చరించారు జస్టిస్ చంద్రు. అలాంటి వాళ్లకే ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందన్నారు జస్టిస్ చంద్రు. సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించారని చెప్పారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ప్రశ్నించారు.కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలన్నారు. జలహక్కులకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని జస్టిస్ చంద్రు చెప్పారు. జై భీమ్ సినిమా తనకు ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందని, ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు తెలిపారు.