Read more!

జగన్‌ పోటికి అనర్హుడే

 

 

 

అసెంబ్లీ రౌడీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఆ సినిమాలో హీరో జైలు నుంచే పోటి చేసి ఎలక్షన్స్‌లో గెలుస్తాడు.. ఎమ్మెల్యే అవుతాడు.. కాని ఇక పై అలాంటి సీన్స్‌ కనిపించక పోవచ్చు.. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పుతో ఇక జైలులో ఉన్న వ్యక్తులకు, వేరే ఏ ఇతర కారణాలతో అయినా పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటిచేయడం కుదరదు..

 

పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల అనర్హతపై బుధవారం సంచలన తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు మరో కేసులో ఈ తీర్పును ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలితే ఆ రోజు నుంచే వారు పదవులకు అనర్హులని జస్టిస్ ఎకె పట్నాయక్, జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన బెంచ్‌ రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది.



ఈ బెంచ్‌ గురువారం మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తికి మాత్రమే ఎన్నికల్లో పోటీ హక్కు ఉంటుందనని తెల్చి చెప్పింది.. జైలుకెళ్లడం, పోలీస్ కస్టడీ వల్ల ఓటు హక్కును కోల్పోయే వ్యక్తికి పోటీ చేసే అవకాశం కూడా ఉండదని చెప్పింది. అయితే ఏ చట్టం కిందనైనా ముందస్తు నిర్బంధంలోకి వెళ్లిన వ్యక్తులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.



ఇప్పటికే కనీసం రెండేళ్ల శిక్ష పడిన వ్యక్తి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక కస్టడీలో ఉన్న వారు కూడా పోటీ చేయడానికి వీల్లేదని తాజాగా పేర్కొంది.



ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఎలా ఉన్న రాష్ట్రరాజకీయలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపనుంది.. భావి ముఖ్యమంత్రి చెప్పుకుంటూ జైలు నుంచే చక్రం తిప్పుతున్న జగన్‌ ఎలక్షన్స్‌ లోపు బయటికి రానిపక్షంలో అతను ఇక ఎన్నికల్లో పోటి చేయడం కుదరదు..