దారుణాలు జరిగిపోతున్నాయ్... జగన్ లబలబ!
posted on Jun 6, 2024 @ 2:39PM
ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్ డ్యూటీ మొదలుపెట్టారు. ‘ఎక్స్’లో ఒక మెసేజ్ పెట్టారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఐదేళ్ళ నుంచి రాష్ట్రం ప్రశాంతంగా వుందట. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయట. తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొందట. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారట. తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందట. అధికార పార్టీ ఒత్తిళ్ళతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందట. ఐదేళ్ళు పటిష్టంగా వున్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయట. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలవాలట. టీడీపీ దాడుల వల్ల నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు ఆయన తోడుగా వుంటారట... ఎక్స్ ముఖ్యమంత్రి ‘ఎక్స్’లో పెట్టిన మెసేజ్ సారాంశం ఇంది.. బాగుందయ్యా.. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కదూ..!