వైఎస్‌ఆర్ జయంతి కానుక... జగన్ రాజీనామా?
posted on Jul 6, 2024 @ 10:42PM
పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోమవారం (08-07-24) నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని, ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి దగ్గర జగన్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని వదంతులు వినిపిస్తున్నాయి. జగన్ రాజీనామా తర్వాత పులివెందుల స్థానం నుంచి జగన్ భార్య భారతిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. జగన్ రాజీనామా చేసి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మొదట జగన్ అసెంబ్లీకి, అవినాష్ రెడ్డి పార్లమెంట్‌కి రాజీనామాలు చేసి, ఆ తర్వాత ఒకరి స్థానంలో మరొకరు పోటీ చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి రిస్క్ చేయడం కరెక్ట్ కాదని తాను పులివెందుల స్థానానికి రాజీనామా చేసి, ఆ స్థానం నుంచి భారతిని నిలపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. జగన్‌కి అసెంబ్లీకి వెళ్ళడం ఎంతమాత్రం ఇష్టం లేదని, అందువల్లే రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇవన్నీ ఊహాగానాలుగానే వినిపిస్తున్నాయి. వైఎస్సార్ జయంతి అయిన సోమవారం దాటితేగాని ఇవన్నీ ఊహాగానాలా? వాస్తవాలా అనే విషయం తెలుస్తుంది.