మాజీ సీఎం జగన్ ప్రెస్‌మీట్... ఏడ్వలేక నవ్వు!
posted on Jun 4, 2024 @ 6:35PM
మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి కూర్చుని కాసేపు వయ్యారపు నవ్వులు నవ్వారు. కొద్ది క్షణాలు నానా రకాల మెలికలు తిరిగారు. ఆ తర్వాత మాట్లాడ్డం ప్రారంభించారు. ఇన్ని కోట్ల మందికి అది చేశాను.. ఇన్ని లక్షల మందికి ఇది చేశాను.. అక్క చెల్లెళ్ళు.. అవ్వతాతలు.. వీళ్ళందరి ప్రేమ ఏమైపోయిందో అంటూ సుదీర్ఘ సుత్తి కొట్టారు. ఈ ఫలితాలు తనకు అశ్చర్యం కలిగించాయని చెప్పారు. ఇలాంటి ఫలితాలను ఎంతమాత్రం ఊహించలేదని అన్నారు. ఎలా జరిగిందో, ఏం జరిగిందో నేను మాట్లాడదలచుకోవడం లేదు.. గెలిచిన వారికి మాత్రం అభినందనలు అని అన్నారు. ప్రతి పక్షంలో వుండటం తనకి కొత్త కాదని, రాజకీయాల్లో బాధలు పడటం కూడా కొత్త కాదని, ముందు ముందు పోరాటం చేస్తానని, పేదవారికి అండగా వుంటానని చెప్పారు. జగన్ మాట్లాడుతున్నంతసేపూ ఇప్పుడు భోరుమని ఏడుస్తారేమో అన్నట్టుగానే పరిస్థితి వుంది. తాను మాట్లాడాల్సింది మాట్లాడేసి, మీడియాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచివెళ్ళిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్‌కి తోకలాగా ఫాలో అయ్యారు.