జగన్ వినాయకుడ్ని ఏం కోరుకునుంటారు?
posted on Aug 28, 2025 @ 9:35AM
జగన్ హిందూ మత విశ్వాసాలను నమ్మరన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన క్రిష్టియన్ సంప్రదాయాలకు విరుద్ధంగా మరో మారు హిందూ దేవతలకు పూజలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన తాను సీఎంగా ఉండగా వెంకన్న సెట్ వేసి.. అక్కడ భక్తి రాహిత్యంతో కూడిన పూజల కారణంగా ఓడిపోయారని అంటారు పలువురు పాస్టర్లు. ఎందుకంటే ఎవరైతే ఏసు ప్రభువును నమ్ముతారో వారు మరొక మతానికి చెందిన దేవుళ్లు, దేవతలకు పూజలు నిర్వహించరాదని అంటారు వీరు.
కానీ జగన్ తనపై ఉన్న క్రిష్టియన్ సీఎం అన్న ముద్ర చెరుపుకోడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఫైనల్ టచ్ ఇద్దామని వెంకన్న సెట్ వేసి మరీ స్వామి వార్ని భారీఎత్తున కాకా పట్టేద్దామని గట్టిగా ట్రై చేశారు. కానీ తన సతీమణి భారతీరెడ్డి తిరుమలలో ఏర్పాటు చేసిన తన సైన్యం ఎఫెక్టూ.. దీంతో పాటు ప్రసాదం న్యాప్ కిన్ కి చుట్టిన పాప ఫలితమూ.. అది కాస్తా బెడిసి కొట్టి స్వామివారు నాతో పెట్టుకుంటే పంగనామాలే అన్న కోణంలో.. పదకొండు సీట్లు ఇచ్చారని అంటారు శ్రీవారి భక్తులు.
ఇప్పుడు చూస్తే వినాయక చవితి సందర్భంగా మరోమారు హిందూ భక్తావతారం ఎత్తారు జగన్. ఈ సందర్భంగా స్వామివారిని ఏదో కోరుకుంటున్నట్టు కనిపించింది. ఆ మర్మరింగ్ కి మీనింగేంటా? అదే ఏం కోరుకుని ఉంటారా? అన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. అదెలంటిదంటే.. ‘గతంలో వైయస్ కుమారుడిగా ఒకే ఒక్క ఛాన్స్ అన్నాను. జనం ఇచ్చారు. వారిని నిండా ముంచాను. ఇప్పుడు చూస్తే నన్ను కనీసం ప్రతిపక్షానికి కూడా దిక్కులేకుండా చేశారు. ఇప్పుడందరూ నన్ను సాధారణ ఎమ్మెల్యే.. సాధారణ ఎమ్మెల్యే.. అని దెప్పి పొడుస్తున్నారు. నువ్వే ఎలాగోలా, ఏదో ఒకటి చేసి మరో మారు నన్ను ముఖ్యమంత్రి చేయి వినాయకా’ అంటూ ఆయన మొక్కినట్టు.. అందుకు వినాయకుడు కూడా వైల్డ్ గానే రియాక్టయినట్టూ భావిస్తున్నారు.
చాలయ్యా జగనూ.. చాలు! జనం సొమ్ము నువ్వు పప్పు బెల్లాల్లా పంచి.. రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలు. ఇకనైనా ఆ అమరావతిని ఎదగనీ. ఆ మాటకొస్తే ముందు నువ్వు నీ వాళ్లు నాలాంటి దేవతలు కొలువైన అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దుష్ప్రచారం చేయించింది ఇక చాలు. దేవతలు అని అక్కడ ఉన్నా కూడా.. నువ్వు దాన్ని వేశ్యలంటూ నీ మీడియా ద్వారా చేయించిన రభస కైలాసం వరకూ రాలేదనుకున్నావా? నాకు మా కరస్పాండెంట్ నారదడు చెప్పారు. ఆపై నా మూషికం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఈ సారి భూలోకం వెళ్లినపుడు మీరు జగన్ కి అట్టే వరాలు ఇవ్వకండి స్వామి.. అతడేం మీ భక్తుడు కాడు. అంతా నాటకం.. హిందూ ఓటర్లను బుట్టలో పడేసే యత్నం. పూజారులు ఏదైనా ప్రసాదం ఇచ్చినా జగన్ ఉండచుట్టి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఎవరైతే హిందూ దేవతల ప్రసాదం తింటారో వారు ఆయా దేవుళ్ల భక్తులవుతారన్న నమ్మకాలున్నాయ్. వాటి ప్రకారం వారెట్టి పరిస్థితుల్లోనూ మన ప్రసాదాలను ముట్టరు. కాబట్టి అట్టే ఆ దొంగ భక్తిని చూసి మురిసిపోకండి స్వామీ అని నాతో చెప్పే పంపింది. మా అమ్మ పార్వతమ్మ కూడా ఇదే చెప్పింది.
కారణమేంటంటే.. నేను ఏమీ లేని పిండి బొమ్మ నుంచి నిన్ను పుట్టించాను. అక్కడ బాబు కూడా ఏమీ లేని ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడానికి ఒక రాజధాని పుట్టించాలని చూస్తున్నాడు. దాన్ని దేవతల రాజధాని అని కూడా అంటారు. నేను చేసే పిండి బొమ్మను ఎవరైనా ధ్వంసం చేయాలని చూస్తే నాకెలా ఆగ్రహం కలుగుతుందో.. అక్కడి ప్రజలకు కూడా సరిగ్గా అలాగే కోపం వస్తుంది. కాబట్టి దయచేసి నువ్వు నా కుమారుడిగా జగన్ని మాత్రం అస్సలు కనికరించవద్దు. ఎందుకంటే అతడు ఇంకా మారలేదు….ఒక రాజధానిని పట్టుకుని అతడి మనుషులు చేపలు పట్టడానికి కూడా పనికిరాదనడం, పులస చేపలు ఇక్కడ దొరకొచ్చని వెటకారం చేయడం.. అక్కడి జనాల్లో కోపం తెప్పిస్తోంది.. ఎవరైతే జన వాక్యం పట్టకుండా అనుచిత వ్యాఖ్యానాలు వినిపిస్తారో వారిని మనం అస్సలు క్షమించరాదు.. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ బేటా! అంటూ మా అమ్మ కూడా చెప్పింది. ఇక మా నాన్న సంగతి సరే సరి. ఆయన మల్లికార్జునుడిగా కొలువైన శ్రీశైలం వేదికగా అన్యమతస్తులను మీ హయాంలో ఎలా ప్రోత్సహించారో.. ఆయన భక్తుల మనోభావాలకు ఎలాంటి కష్టం కలిగించారో ఒక సారి గుర్తు చేశారు. కాబట్టి నీ కోర్కెలు నేను తీర్చితే- జనం కోర్కెలకు గోరీ కట్టడమేనని ఆ వినాయకుడు కూడా జగన్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోందన్న కామెంట్లు వినవస్తున్నాయ్.