తెదేపాకు చంచల్ గూడా జైలర్ సవాలు

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి చంచల్ గూడా జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి జైలర్ బి.సైదయ్య జైల్లో రాజభోగాలు సమకూరుస్తు, జగన్ సేవలో తరిస్తున్నాడని, జగన్ జైల్లో ఉన్నపటికీ శాటిలైట్ ఫోన్స్ విరివిగా ఉపయోగిస్తున్నాడని, ములాకాత్ పేరుతో రోజూకి కనీసం 400మంది జగన్ మోహన్ రెడ్డిని కలుస్తున్నారని, జైలులో ఖైదీలకు కూడా ఇప్పుడు జగన్‌ కోసం బయట నుండి వచ్చే వంటకాలనే వడ్డిస్తున్నారని తెదేప నేత వర్ల రామయ్య ఆరోపించారు.

 

ఈ ఆరోపణలను జైలర్ జైలు సూపరింటెండెంట్ బి.సైదయ్య ఖండింస్తూ “వారు చేసిన ఏ ఒక్క ఆరోపణ నిరూపించినా నేను ఎటువంటి క్రమశిక్షణ చర్యలకైనా నేను సిద్దం. జైలులో నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రోజుకి ఎంతమంది వచ్చేవారో, ఆయనని కలవడానికి ఎవరెవరు వచ్చేవారో మొదలయిన వివరాలన్నీ కూడా రికార్డింగ్‌లో నిక్షిప్తం చేయాబడి ఉంటాయి. గనుక, బయట నుండి నిబందనలకు వ్యతిరేఖంగా మనుషులు, వస్తువులు లేదా ఆహారం లోపలివస్తే తప్పని సరిగా అందులో రికార్డ్ అవుతాయి. అటువంటప్పుడు తెదేపా నేతలు ఇటువంటి ఆరోపణలు చేయడం అర్ధరహితం. వారు ఇకనయినా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. లేకుంటే చటరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోను,” అని జైలు సూపరింటెండెంట్ సైదయ్య హెచ్చరించారు.

 

కానీ, టీడీపీ నేత వార్ల రామయ్య మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన మళ్ళీ అవే ఆరోపణలు చేయడమే కాకుండా, ఇప్పుడు మరో సరికొత్త ఆరోపణ కూడా చేసారు. జగన్ సేవలో తరిస్తున్నజైలు సూపరింటెండెంట్ సైదయ్య జగన్ జైల్లో చేరక మునుపు అతని ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పటి అస్తులు ఎంతనే వివరాలు చెప్పాలని డిమాండ్ చేసారు.

Teluguone gnews banner