రేపు  కెసీఆర్ ను పరామర్శించనున్న జగన్ 

రాజకీయ టక్కు టమారా  గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన తెలంగాణ మాజీ సిఎం కెసీఆర్ ను ఆయన చిరకాల మిత్రుడు ఎపి ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. 
గత నెలలో ఫామ్ హౌజ్ బాత్రూంలో కాలు జారిపడి తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలైన  కెసీఆర్ ను జగన్  గురువారం నాడు  (జనవరి 4)  హైదరాబాద్ లో పరామర్శించనున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌  గత నెలలో ఫోన్ ద్వారా  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
ఇప్పటికే టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు కెసీఆర్ చికిత్సపొందుతున్న సమయంలోనే యశోదా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. కెసీఆర్ ను పరామర్శించడానికి చంద్రబాబు వచ్చిన సమయంలో కెటీఆర్, కవితలు మొహం చాటేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో  కనీసం అభినందించని కెసీఆర్ ను ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించారు. 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టిఆర్ఎస్  సహకరిస్తుందని, పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ మద్దత్తు ఇస్తానని కెసీఆర్ గతంలో అన్నారు.

Teluguone gnews banner