జగన్ గణాంకాలు...అయోమయంలో జనాలు!
posted on Sep 17, 2022 @ 12:15PM
ఏదో తేడాగా ఉంది.. నీకేమీ అనిపించడం లేదా?.. అని హీరో ఒక కమిడియన్‌ని అడుగుతాడు.. ఏం లేదే అన్న ఆ కమెడియన్‌కి క్షణం తర్వాత అసలు సంగతి తెలిసి పరుగుపెడతాడు.. ఇది ఓ సినిమాలో సీన్. ఇది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయంలో తెలుగు రాజకీయనాయకులు అన్వయిస్తున్నారు. అధికా రంలోకి వచ్చి నాలుగేళ్లయినా జగన్‌లో ఎలాంటి విజ్ఞతా అస్మదీయులు, తసమదీయులూ గమనించక పోవడమే వింత. ఆయన ఇటీవలి కాలంలో మాట్లాడుతున్న ప్రతీ మాటా వైసీపీ నాయకులను ఆశ్చర్య పరుస్తోంది..పైకి ప్లాస్టిక్నవ్వులు నవ్వుతూనే ఇదేందన్నా ..ఈనేనా మన నాయకుడు..అనుకుం టున్నా రు. మరీ ముఖ్యంగా ఈ మధ్యనే ఏకంగా కులాల ప్రస్థావన తేవడం వైసీపీ నాయకులకు కాళ్ల కింద నేల చీలినంత పనయింది. ఆయనకు తనవారిని, పరవారిని జ్ఞానులను చేయాలన్న ఆతృత మరీ ఎక్కు వ యింది. ఆ వీరావేశంలో ఏం మాట్లాడుతున్నారో కనీసం పద ప్రయోగమూ తెలీనంత దూకుడు ప్రదర్శి స్తున్నారు.
కానీ ఇక్కడ కామెడీ ఏమిటంటే జగన్ మూడేళ్ల పాలన గురించి ఆయన హామీలు, చేసిన చేతలు, మంత్రు ల భజనలు,కీర్తనలు అన్నీ ప్రజలకు తెలిసినంతగా, వారికున్నంత అవగాహనా ప్రభువుకీ, అను చరులకీ బొత్తిగా లేదు. తామేదో వెలగబెట్టామని ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని వేగులను పంపితే వారికి వాతలు పడి వెనక్కొచ్చి చొక్కా వేసుకుని రాజావారి దగ్గరికి నవ్వుతూ వెళ్లి అంతా బాగానే ఉంది అని చెప్పడం. ఆనక ఏం జీవితంరా బాబూ అనుకోవడం ఏక కాలంలో జరిగాయి. వారికి ప్రభువును సంతోషపెట్టడం, తమను తాము కాపాడుకోవడానికే నాలుగేళ్లయిపోయింది మరి. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేవలం చందమామ తీసుకువస్తానని రాకుమారుడి వాగ్దానం లాంటిది. గుర్రం ఎగరదు, చందమామ చిక్కదు!
దీనికి మించి జగన్ తెలివి లాక్‌డౌన్ సమయంలో మరింత స్పష్టంగా చూశారు. అంతా కరోనా తో గొల్లుమంటూంటే బ్లీచింగ్ పౌడర్ రాష్ట్రమంతా అన్నీ గల్లీల్లో వేస్తే ఈగలు, దోమల బెడద తీరుతుంది. ప్రజలకు కరోనా పీడ విరగడవుతుందని చెప్పడం. ప్రపంచ ఆరోగ్యసంస్థకి తెలిస్తే అమాంతం చార్మినార్ ఎక్కి దూకే వారేమో! వారి పరిశోధనల కాయితాలు పిల్లలకు పడవలయ్యేవేమో!
నిజం కటువుగానే ఉంటుంది. కానీ సర్కారు వారికి నిజాలు కూడా హోమియో తీపి గుళికల్లా చెప్పాలంటే ఎలా? అది ఒక్క అనుచరులకు, వీరాభిమానులకే సాధ్యపడుతుంది గాని ప్రజలకు, విపక్షాలకు కుదురు తుందా? వాస్తవాన్ని అద్దంలో చూపాలి, అబద్ధాల్ని చెవిలో చెప్పాలంటారుగదా! కానీ ప్రజలకు అవేమీ అక్కర్లేదు.. రోడ్డు, ఆస్పత్రి, బస్సులు సరిగా ఉంటేచాలు. సరిగ్గా అవే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఓట్ల కు మాత్రం పరిగెట్టే నాయకులు అవేమీ చేయకుండా ఒక ప్రశ్నావళితో ప్రజలవద్దకు వెళితే మురు క్కుంట చూపి బావుచేయమనే అంటారుగదా!
తాను ఐదు వేల రూపాయలు ఇచ్చి నియమించిన వాలంటీర్లు నెలకు ఓ సారి లబ్దిరాలకు రూ. రెండు వేలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడాన్ని వికేంద్రీకరణ అనేశారు జగన్ రెడ్డి. అంతేనా ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ కూడా వికేంద్రీకరణ కోటానే. ఇది చాలా మందికి తెలియదు. పెద్ద పెద్ద మేనెజ్ మెంట్ ప్రొఫెస ర్లకు కూడా తెలి యదు. ఇంత చక్కగా వికేంద్రీకరణం చేసేశాకా మరి మూడు రాజధానులతో కొత్తగా చేసే దేముందని.. చాలా మందికి వచ్చే డౌట్. కానీ వారంతా జగన్ లాంటి విజ్ఞాన గని ముందు ఎందుకూ కొరగారు కాబట్టి వారి సందేహాలను పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన తెలివి తేటల్ని.. నాలెడ్దిని చూసి మా ముఖ్యమంత్రి ఇంత గొప్ప వ్యక్తా అనుకోవాల్సిన పరిస్థితి.
ఆయనకు తోడు ఐఐటీలో చదివిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిండు సభలో కూర్చుని కిటీకీలే లేవు ఇదా కట్టించింది అని మాట్లాడటం ..నాయకుడికి తగ్గ అనుచరులు అనిపించుకున్నారు. వీరి విజ్ఞాన ప్రదర్శ న..వారి ఫ్యాన్స్‌కు నచ్చుతుందేమో కానీ కాస్త బుర్ర ఉన్న వాళ్లకు మాత్రం ఇదేందిరా అని అను కోకుండా ఉండలేరు. అమరావతికి అయ్యే ఖర్చుపై చెప్పిన లెక్కలకు ..గణితశాస్త్రంలో నోబెల్ ఇవ్వా ల్సిందే ! ఎప్పుడైనా ముఖ్యమంత్రిగారు చూసి రాసే ప్రసంగాల్లో అంకెలను చదవాల్సి వచ్చిన ప్పుడు…అయన చెప్పేలెక్కలు చాలా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అటూ చాలా మంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. నోరు తిరగక అలా అంటూ ఉంటారులేని అని చాలా మంది అనుకుంటారు. కానీ అమరావతి నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందని అదంతా ప్రభుత్వమే పెట్టుకోవాల ని.. అంత నా దగ్గర ఉంటే.. అభివృద్ధి చేయనా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేశారు.
ఎకరానికి మౌలిక సదుపాయాల కోసం రూ. కోటి ఖర్చవుతుందని చంద్రబాబు లెక్కలేశారని అది ఇప్పుడు అంత కంటే ఎక్కువ అవుతుందని కబుర్లు బాగానే చెప్పారు కానీ.. అసలు అమరావతి గురించి ఏమీ తెలియదా.. తెలియనట్లు నటించారా అన్నది జనాలకు కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఓ ప్రపంచ స్థాయి నగరం నాలుగైదులక్షల కోట్లకు రెడీ అయిపోతుంది. అందులో డౌట్ లేదు. ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న ఆస్తు లన్నీ ప్రభుత్వం ప్రజాధనంతో కట్టించిందా? . అక్కడ రోడ్లు , డ్రైనేజీ లాంటి మౌలిక సదుపా యా ల్నే కట్టించింది. మిగతా అంతా ప్రైవేటు వ్యక్తులు డెలవప్ చేశారు. అది హైదరాబాద్‌కు వచ్చిన పెట్టుబడే. అంత మాత్రాన అది జనం సొమ్మంటారా?. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను చూసిన అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కూడా శభాష్ అనుకుండా ఉండలేకపోయారు. ఇంత భారీ సంపద సృష్టి ఆలోచన భేష్ అన్నారు.
ఒకరు వేసిన బొమ్మని లోకం మెచ్చుకున్న తర్వాత మరొకరు వచ్చి దాన్ని వంటింట్లో దాచి నేను వేసిందే మహాద్భుతం అంటూ మరోటి చూపే ప్రయత్నాన్ని, ప్రచారాన్ని ఎవరయినా మెచ్చుకుంటారా? రాజధాని విషయంలో ఇదే జరుగుతోంది. నలుగురు మెచ్చుకున్నదాన్ని కొనసాగించి కాస్తంత మెరు గులుదిద్ది అది పూర్తి చేయడానికి కృషి చేస్తే అదరికీ మేలు జరిగేది కానీ ఆ మేలు ఒక్కరికే ప్రచారమవుతుందన్న బుద్ధిహీ నుల సలహాలతో త్రోసిపుచ్చడం అవమానాన్నే మిగిల్చింది. కానీ జగన్‌కి ఈ సంగతి అర్ధం కావడం లేదా లేక నటిస్తున్నారా అన్నది తెలీడం లేదు. అన్నీ తన వూళ్లో జరిగినట్టే జరగాలంటే ఎలా? కాలం మారిం ది. ప్రజలకు ఓటు విలువు, రాజకీయాల విలువ, నాయకుల మాట సత్తా అన్నీ తెలుసు, అసలా మాటకు వస్తే ఓటరు కన్నా నాయకులు పెద్ద తెలివిమంతులు కారన్నది లోకోక్తి!