కన్నా కౌంటర్.. రాజధానిలో బాబు రియల్ ఎస్టేట్ చేస్తే.. జగన్ ఏకంగా అమ్మేస్తున్నాడు
posted on Dec 27, 2019 @ 3:56PM
ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన చోట మౌనదీక్ష చేపట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేశారు కన్నా.సీడ్ క్యాపిటల్ ఇక్కడే ఉండాలన్న తమ విధానం తెలియజేశామని.. మళ్లీ గంట గంటకు విధానాన్ని తెలియ జేయటానికి తానేమి చంద్రబాబునాయుడు,జగన్ మోహన్ రెడ్డిని కాదని ఆయన మండిపడ్డారు.తమ పార్టీ విధానాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరిస్తామన్న ఆయన తెలియజేశారు.
గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజధాని రైతులను మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా క్యాపిటల్ ను అమ్మేసి కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మనారాయణ. చంద్రబాబు నాయుడు రాజధాని భూములను స్వర్గంగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని కాలయాపన చేశారన్నారు. అవినీతికి అనుకూలంగా లేదని.. ముంపు ప్రాంతం అని చూపించి ఏకంగా రాజధానిని అమ్మటానికే కుట్ర చేస్తున్నట్లు కన్నా ఆరోపించారు.
క్యాబినెట్ నిర్ణయం తీసుకోకముందే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఆయన స్పందించారు. కుట్ర పూరితమైన ఆలోచనతో భేటి జరుగుతుందన్నారు. క్యాపిటల్ ఉండగా దీని పై జీఎన్ రావ్ కమిటీ వేయడం.. ఆ కమిటి పూర్తయ్యి నిర్ణయం రాక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడతారని విజయసాయి ప్రకటనలు చేయడంపై ఆయన మండిపడ్డారు. కాబినెట్ మీటింగ్ నిర్ణయాలు రాక ముందే నిన్న వాళ్ల పార్టీ ఎంపీ విశాఖపట్నంలో పండగలు చేసుకోటం ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్రపూరితమైన చర్యలు తప్ప అంతకు మించి ఏమి జరగట్లేదని కన్నా మండిపడ్డారు.క్యాబినెట్ నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి