జగన్ సర్కార్ అప్పుల తిప్పలు..
posted on Dec 19, 2021 @ 7:46PM
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల చిక్కుల్లో చిక్కుంది. నిజమే, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అప్పుల చిక్కుల్లో చిక్కుకోవడం ఏమిటి.. ఎప్పుడోనే అప్పుల ఊబిలో కూరుకు పోయింది కదా, అనచ్చును. కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కొత్తగా వచ్చి పడిన కష్టానికి, మరో అప్పు మార్గం కూడా కనిపించడం లేదు. దేశంలో ఈ స్థాయిలో అప్పులు చేసిన మరో రాష్ట్రం ఉందో లేదో కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం అవకాశం ఉన్నఅన్ని సోర్సెస్ నుంచి ఆఖరి పైసా వరకు అప్పు తెచ్చుకుంది. చివరకు ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సొమ్ములను, జగన్ రెడ్డి ఇంచక్కా పుచ్చేసుకుంది. ప్రభుత్వ శాఖల వద్ద, లక్ష రూపయలు ఉన్నా అవీ ఇచ్చేయండని ఉత్తర్వులు జారీచేసి మరీ తెచ్చేసుకుంది.
అంతకు ముందే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద అప్పుపుచ్చుకునే వెసులు బాటున్న మూడు అప్పు దారుల్లోంచి, రూ. 4,900 కోట్లు అప్పు తెచ్చుకుని బకాయి పడింది. ఇప్పుడు ఈ బకాయిల వసూలు కోసం ఆర్‌బీఐ అధికారులు జగన్ రెడ్డి ప్రభుత్వం మెడ్ మీద కత్తిపెట్టి వెంట పడుతున్నారు. ప్రస్తుతానికి అయితే, ఆర్‌బీఐ అధికారులు రోజూ ప్రోద్దున్నే సుప్రభాతం వినిపింఛినట్లు, నిష్ఠగా ఈ మెయిల్స్ పంపి అప్పు సంగతి గుర్తు చేస్తున్నారు. బకాయి సొమ్ము తక్షణం చెల్లించండి, లేదంటే రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులకు ఫోన్లుచేసి అధికార బాషలో అక్షింతలు కూడా వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ గౌరవ మర్యాదలు కొంత వరకే అని ఆ గీతదాటీతే, గతంలో కేంద్ర విద్యుత్ ఆర్థిక సంస్థల అధకారులు, ఏపీ అప్పుల వసూలుకు విజయవాడ వచ్చినట్లుగా, ఆర్‌బీఐ అధికారులు కూడా వచ్చినా రావచ్చని అంటున్నారు.
ఇంతవరకు ఇక్కడ తెచ్చి అక్కడి అప్పు, ఆక్కడ తెచ్చి ఇక్కడి అప్పు సర్దుబాటు చేస్తూ వచ్చిన రాష్ట్ర అప్పుల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి కుడా ఈ అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం కనిపించడం లేదు. అవకాశం ఉన్న మేరకు అప్పులన్నీ నవంబరులోనే వాడేశారు. అన్ని శాఖల నుంచీ ఊడ్చి మరీ ఖర్చుపెట్టేశారు. రూ.1,000 కోట్ల అప్పును మాత్రం డిసెంబరు మొదటివారంలో తెచ్చి వాడారు. ఇక ఆ తర్వాత ఏ శాఖలోనూ నయాపైసా మిగల్లేదు. బ్యాంకుల వద్దకు వెళ్లే అప్పులివ్వడానికి అవి సవాలక్ష షరతులు పెడుతున్నాయి. దీంతో ఆ ప్రయత్నాలూ ఫలించలేదు. కేంద్రం కొత్త అప్పులకు అనుమతివ్వకపోవడంతో.. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి అప్పులు తెచ్చుకునే వెసులుబాటును రాష్ట్రం కోల్పోయింది.ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ అప్పు తీర్చేందుకు కొత్త అప్పు పుట్టే దారేది కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మునిగిపోతే అత్యవసరమైన అప్పులు కట్టేందుకు ప్రతి రాష్ట్రం ఆర్‌బీఐ వద్ద సింకింగ్ ఫండ్ జమ చేస్తుంది.
అయితే జగన రెడ్డి ప్రభుత్వం సికింగ్ ఫండ్’ని కూడా సక్రంగా నిర్వహించక పోవడంతో, టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఈఎస్‌డీఎల్ కింద ఆర్‌బీఐ నుంచి రాష్ట్రం రూ.2,200 కోట్లు తీసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం రూ.700 కోట్లు మాత్రమే తీసుకోగలుగుతోంది. దీనిఫలితమే రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.అయితే అన్నిటికీ మూలం, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక క్రమ శిక్షణ అటకెక్కించడమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.