భయపడిపోయిన పులివెందుల పిల్లి!
posted on Jul 20, 2024 @ 11:47AM
జగన్‌ని అతని దండుపాళ్యం బ్యాచ్ అందరూ పులివెందుల పులి అని అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు గానీ, జగన్ పులివెందుల పులి కాదు.. పులివెందుల పిల్లిపిల్ల అనే విషయం క్లియర్‌గా అర్థమైపోయింది. శుక్రవారం నాడు జగన్ వినుకొండ వెళ్ళి మృతుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న సమయంలో ఎదురుగా వున్న వాళ్ళు కూర్చున్న మంచం లాంటిది విరిగిపోయి భళ్ళుమని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ విని జగన్ భయపడిపోయాడు. ఓ క్షణంపాటు అయోమయం చూపు చూశాడు. తన మీద ఏదైనా ఎటాక్ జరిగిందా అన్నట్టుగా షేక్ అయ్యాడు. ఆ తర్వాత అసలు విషయాన్ని అర్థం చేసుకుని తమాయించుకున్నాడు. జగన్ పిరికివాడని తెలుసుగానీ, ఆ విషయాన్ని మరీ ఇలా ప్రత్యక్షంగా చూడ్డమే చాలా కామెడీగా అనిపించింది.
పులి.. పులి.. అని భజన చేయించుకోవడం వల్ల పిలి పులి అయిపోదు. ‘పులి’ అంటే ఎలా వుంటుందో చంద్రబాబుని చూస్తే అర్థమవుతుంది. అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేలినప్పుడు, రక్తసిక్తమైపోయిన చంద్రబాబు వ్యవహరించిన తీరు వుంది చూశారా.. అది పులి అంటే.. అంతేగానీ, చిన్న శబ్దానికే గత్తరపడిపోయేవాళ్ళని పులి అనడం కాదు.. పిల్లి అనాలన్నా కూడా ఇబ్బందికరంగానే వుంటుంది.