Read more!

బస్సు యాత్ర తుస్సు.. జగనన్న సీరియస్సు!

జగనన్న వస్తున్నాడంటేనే జనం ఆ ఏరియాల నుంచి పారిపోతున్న పరిస్థితి. ఆయనగారు వస్తున్నాడంటే పోలీసుల హడావిడి, అనుమానితుల పేరుతో అరెస్టులు.. పైగా ఆయన చెప్పే అబద్దాలు వినలేక అవస్థలు. ఈ గోలంతా ఎందుకని జనం ఆయన సభలకు దూరంగానే వుంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ చేస్తున్న బస్సు యాత్రకు జనం నుంచి స్పందన దాదాపు శూన్యంగా వుంది. జగన్ బస్సు యాత్ర చేస్తే జనం విరగబడి చూస్తారని అనుకున్న వైసీపీ వర్గాలకు పెద్ద షాక్ తగిలింది. జగన్ బస్సు రోడ్డు మీద వుంటే జనం ఎవరి పనిలో వాళ్ళు వుంటున్నారు తప్ప ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. 
తాను చేస్తున్న బస్సు యాత్రలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో జగన్ ఆయా ప్రాంతాల్లో వున్న వైసీపీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముందు అనుకున్న ప్రకారం నాన్‌స్టాప్‌గా బస్సు యాత్ర నిర్వహించాల్సి వుంది. జనం నుంచి స్పందన లేకపోవడంతో బస్సు యాత్రకు ఒక్కరోజు బ్రేక్ వేశారు. ఉత్తరాంధ్ర నేతలో  కీలక సమావేశం పేరుతో ఎజెండాలోని కొత్త ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకొచ్చారు. విజయనగరం జిల్లాలో తాను బుధవారం నుంచి బస్సు యాత్ర చేస్తానని, దీని కోసం జన సమీకరణ భారీ స్థాయిలో చేయాలని, లేకపో్తే మామూలుగా వుండదని జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.