జగన్... రామోజీని కలిసేవరకూ బాబుకి కూడా తెలియదా?
posted on Sep 24, 2015 @ 11:20PM
రామోజీరావును జగన్ కలవడంపై తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేగుతోంది, తెలుగుదేశానికి వెన్నుదన్నులా నిలిచే రామోజీరావు ఇలా సడన్ గా జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంపై ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. జగన్ కి రామోజీ అపాయింట్ మెంట్ ఇచ్చిన సంగతి కనీసం చంద్రబాబుకి కూడా తెలియదని, రామోజీ-జగన్ భేటీని ఏపీ ఇంటలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయిందని అంటున్నారు, జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలిశాక మాత్రమే ప్రభుత్వ వర్గాలకు, పార్టీ నేతలకు తెలిసిందని చెప్పుకుంటున్నారు, అసలు జగన్ ఎందుకు రామోజీని కలిశాడు, ఏం మాట్లాడు అంటూ ఇంటలిజెన్స్ ఆరా తీసే పనిలో పడిందట.