జగనే ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం: కేసీఆర్ నోట సీమాంధ్ర మాట
posted on May 9, 2014 @ 5:54PM
విభజనవాది కేసీఆర్, సమైక్యవాది ముసుగులో వున్న పచ్చి విభజనవాది జగన్ మధ్య వున్న ఆత్మీయత మరోసారి బయటపడింది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం వీరిద్దరి మధ్య వున్న అనుబంధానికి అద్దం పట్టింది. కేసీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే, తెలంగాణలో టీఆర్ఎస్‌కి 90 సీట్లు వస్తాయట. కాంగ్రెస్‌కి మాత్రం 23 నుంచి 30 స్థానాలు మాత్రమే వస్తాయట. ఈయనగారు తెలంగాణ సీఎం అవుతాడట. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందట. మొన్నటి వరకూ సోనియాని, రాహుల్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు సోనియా, రాహుల్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం, ఆ తల్లీకొడుకులంటే తనకెంలాంటి వ్యతిరేకత లేదని చెప్పడం వెరైటీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మూడో ఫ్రంట్ గురించి ఆలోచిస్తాడట. అంతేగానీ ఎన్టీయేకి మాత్రం మద్దతు ఇవ్వడట. ఇదిలా వుంటే ఈ డూప్లికేట్ తెలంగాణ బిడ్డ తన తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించకుండా సీమాంధ్ర గురించి, జగన్ గురించి ఆలోచించేశాడు. సీమాంధ్రలో జగన్ వందకు పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తాడట. తాను చేసిన స్పెషల్ సర్వేలో జగన్‌కి వందకంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదని తెలిసిపోయిందట. తెలుగుజాతి ప్రయోజనం కోసం తాను, జగన్ కలసిమెలసి పనిచేస్తారట.