ఇటలీ రాయభారిపై ఆంక్షలు తొలగించిన సుప్రీం కోర్టు
posted on Apr 2, 2013 @ 10:21PM
కొద్ది రోజుల క్రితం ఇటలీ రాయభారి డానీయేలీ మంసినీని భారతదేశం విడిచి వెళ్ళడానికి వీలులేదని ఆదేశించిన సుప్రీం కోర్టు, ఇద్దరు భారతీయ మత్స్యకారులను కాల్చి చంపిన కేసులో అరెస్టయిన ఇద్దరు ఇటలీ నావికుల మాస్సిమిలానో లతోర్ మరియు సలవతోరే గిరోనే లను, ఆ దేశం తిరిగి భారత్ కు తిప్పి పంపడంతో తను ఇదివరకు ఇటలీ రాయభారిపకి జారి చేసిన ఆదేశాలను ఉపసంహరించుకొని ఆయన స్వదేశం తిరిగి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.
కొద్ది వారల క్రితం సుప్రీం కోర్టు ఇటలీ రాయభారి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీతో వారిని ఇటలీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఇటలీ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఆ తరువాత ఇటలీ ప్రభుత్వం మాట తప్పి వారిని వెనక్కి తిప్పి పంపే ప్రసక్తి లేదని అని స్పష్టం చేయడంతో పార్లమెంటులో చాల పెద్ద రాద్దాంతమే జరిగింది. ప్రతిపక్షాల ఒత్తిడి భరించలేక ఇటలీ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు భారత విదేశంగశాఖ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ, ఇటలీ మొదట లొంగలేదు.
అయితే సుప్రీం కోర్టు తన రాయభారిని దాదాపు నిర్బందించినంత పనిచేయడంతో ఇక చేసేదేమీ లేక ఇటలీ ప్రభుత్వం తన ఇద్దరు నావికులను భారత్ కు త్రిప్పి పంపింది. అందువల్ల సుప్రీం కోర్టు కూడా తన ఆదేశాలను ఉపసంహరించుకొంది. అంతే కాకుండా ఇద్దరు ఇటలీ నావికులను విచారించేందుకు వెంటనే ఒక ప్రత్యేక న్యాస్థానం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే, తమ నావికులను అరెస్ట్ చేయకూడదు, మరణ శిక్ష వేయకూడదు అనే రెండు ముందస్తు షరతులు పెట్టి మరీ భారత్ కు అప్పగింపబడిన ఇటలీ నావికులను ఇప్పుడు భారత ప్రభుత్వం ఇటలీ దేశానికి ఇచ్చిన హామీ ప్రకారం ఆ షరతులు ఉల్లంఘించకుండా, అదే సమయంలో భారతీయ మత్సకారులను చంపినందుకు తగిన శిక్ష విదిస్తూ సుప్రీం కోర్టు సున్నితమయిన ఈ కేసును ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.