వివేకా కేసులో సీబీఐకి షర్మిల సాక్ష్యం! వైఎస్ భారతీ జగన్ రెడ్డి బుక్కైనట్టేనా?
posted on Jan 2, 2022 @ 1:01PM
2022 సంవత్సరంలో ఏపీ సీఎంకు చుక్కలు కనిపించబోతున్నాయా? జగన్ రెడ్డి పదవికి గండమేనా? అంటే వైసీపీ వర్గాల నుంచే అవుననే సమాధానమే వస్తోంది. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు జగన్ హాజరుకావాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన రాజీనామా చేసే అవకాశాలుంటాయి. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వ్యతిరేక తీర్పు వచ్చినా జగన్ పదవికి గండమే. ఒకవేళ హైకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించారు ఎంపీ రఘురామ. ఇది కూడా జగన్ కు ఇబ్బందికరమే.
ఇక వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని అంటున్నారు. ఫ్యామిలీలో జగన్ ఒంటరి అయ్యారని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఇడుపాలపాయకు వెళ్లిన జగన్... కుటుంబంతో కాకుండా సింగిల్ గానే వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ కూడా ఆయనతో కనిపించలేదు. ఇడుపుల పాయ గెస్ట్ హౌజ్ లో జగన్ తో షర్మిల గొడవ పడ్డారని, రాత్రికి రాత్రే అక్కడినుంచి వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఆస్తి విషయంలో కొన్ని రోజులుగా జగన్ తో గొడవ పడుతున్న షర్మిల.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అందుకే అన్న సంగతి తేలుస్తానంటూ ఆమె శపథం చేస్తుందని తెలుస్తోంది. షర్మిలకు తల్లి విజయమ్మతో పాటు వైఎస్ కుటుంబం మద్దతు ఉందని అంటున్నారు.
ఇన్ని సమస్యలు ఉన్న జగన్ కు వైఎస్ వివేకా హత్య కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ను ఫిక్స్ చేసే అవకాశం షర్మిలకు లభించిందని తెలుస్తోంది. ఈ కేసులో ఆమెను సాక్ష్యం చెప్పమని సీబీఐ అధికారులు సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని.., స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని సమాచారం. వివేకా హత్య కేసులోకి భారతీరెడ్డిని షర్మిల లాగేసిందని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో బయటకు తీసిన సీబీఐ.. వారిలో భారతీరెడ్డి కూడా ఉన్నారని తేల్చారట. దీంతో భారతీరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. భారతీరెడ్డికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలను సీబీఐకి చెప్పేందుకు షర్మిల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.నదీంతో వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చేధిస్తే వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందుూ, జగన్ అక్రమాస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యే అవకాశ ఉందంటున్నారు.
మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు తేలుతాయో లేదో కానీ ఈడీ కేసులు మాత్రం త్వరలోనే తేలిపోతాయన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. ఈడీ కేసుల్లో తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే.. తన తర్వాత సీఎం చాయిస్‌గా భారతీరెడ్డిని జగన్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. పాలనా వ్యవహారాల్లో ఇప్పటికే ఆమె జోక్యం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే షర్మిలకు మాత్రం ఇది ఇష్టం లేదట. అందుకే ఆమె భారతీరెడ్డిది కాదని సీఎం జగన్ తల్లి విజయలక్ష్మికి తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. జగన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భారతీరెడ్డికి చాన్స్ ఇవ్వకూడదని తల్లి విజయలక్ష్మికే అవకాశం ఇవ్వాలని షర్మిల పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే వివేకా హత్య కేసులో భారతీ రెడ్డిని ఇరికించేలా షర్మిల ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే ఏపీలో సంచనలం జరగడంతో పాటు వైఎస్ కుటుంబంలోనూ కీలక పరిణామాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 2022లో జగన్ రెడ్డికి చిక్కులు తప్పవనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.