వాకింగ్ పో*ర్న్.. క్రికెటర్లపై చీర్‌లీడర్ షాకింగ్ కామెంట్స్..
posted on Jul 15, 2021 @ 5:13PM
అందం ఎక్కడ ఉంటుందో.. అక్కడ ఆ ప్రమాదం తప్పకుండా ఉంటుందంటారు. అది బ్యూటీ షోలైనా.. క్రికెట్ మ్యాచులైనా. ఆటను.. ఆటగాళ్లు, ప్రేక్షకులకు మాత్రమే పరిమితం చేయకుండా.. మధ్యలో అందాల రాశులను జత చేస్తే.. ఆ తప్పు జరగకుండా ఉంటుందా? అంటే, అల్రెడీ జరిగిపోయిందంటున్నారు. ఐపీఎల్ పార్టీలు, క్రికెటర్ల మైండ్‌సెట్‌పై ఓ చీర్ లీడర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ఐపీఎల్‌ను షేక్ చేస్తోంది.
ఐపీఎల్ పార్టీలపై ముంబై ఇండియన్స్ చీర్ లీడర్ గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో షాకింగ్ కామెంట్స్ చేశారు. చీర్ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలాకాలం తర్వాత గాబ్రియెల్లా మరోసారి ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తన బ్లాగులో.. క్రికెటర్లు తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై రాసిన వివరాలు నిజమేనని, యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని కామెంట్స్ చేశారు.
‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నన్ను చీర్ లీడర్ బృందం నుంచి తొలగించారు. పార్టీల్లో మమ్మల్ని ఓ మాంసం ముద్దగానే చూసేవారు. నేను ఎవరో చెప్పిన విషయాలు నా బ్లాగ్‌లో రాయలేదు. బాహుశా.. నాపై ఫిర్యాదు చేసిన క్రికెటర్‌కు దోషిననే భావన కలిగి ఉండవచ్చు’ అని గాబ్రియెల్లా చెప్పుకొచ్చారు. అయితే, ఐపీఎల్ చీర్ గార్ల్ గాబ్రియెల్లా చాలా రోజుల క్రితం.. ‘@ఐపీఎల్ గర్ల్’ పేరుతో తనకు జరిగిన అనుభవాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించేవారు.
ఈ క్రమంలో ఆమె ఓ గుర్తు తెలియని వ్యక్తి ఐడీతో ఓ బ్లాగ్‌ను క్రియేట్ చేశారు. అందులో ఐపీఎల్ పార్టీలు, క్రికెటర్ల గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ క్రికెటర్ చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను చీర్ లీడర్స్ బృందం నుంచి తొలగించారు. తాజాగా, ఆమె.. We are like walking p*rn అంటూ కామెంట్లు చేయడం ఐపీఎల్ పార్టీల లోగుట్టు మరోసారి రట్టు అవుతోంది. ఓ వెబ్ పోర్టల్‌లో వచ్చిన ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.