ఇంటర్ సెకండియర్ ఫలితాలు: కృష్ణా జిల్లా టాప్
posted on May 3, 2014 @ 12:31PM
ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11:30నిమిషాలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ అహ్మద్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 82శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాలలో బాలికలే పై చేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 69.52 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 61.87. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు ఈ నేల 9 అలాగే రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్ కూడా తొమ్మిది లోపు దరఖాస్తు చేసుకోవాలి.