దిగ్విజయ్ రాసలీలపై మరదలి మండిపాటు
posted on May 3, 2014 @ 12:49PM
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం నడుపుతూ, వీరి ఫొటోలు బయట పడగానే పెళ్ళి మార్గంలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. దిగ్విజయ్ గానీ, అమృత గానీ తమ గుట్టు బయటపడినందుకు ఎంతమాత్రం సిగ్గుపడటం లేదు. తమని విమర్శిస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ సిగ్గులేని తనానికి పరాకాష్టగా కనిపిస్తున్నారని జనం అనుకుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ తన ఘనకార్యాన్ని చాలా గొప్ప విషయంలా చెప్పుకుంటున్నాడు. నరేంద్రమోడీ తన పెళ్ళి విషయం దాచిపెట్టాడట. తాను మాత్రం తన అక్రమ సంబంధం విషయాన్ని దాచిపెట్టకుండా, తన లవర్ని పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించాడట. కాబట్టి తానే మోడీకంటే మంచోడట. ఇలాంటి వితండవాదంతో సిగ్గు ఎగ్గు వదిలేసిన దిగ్విజయ్ సింగ్‌ని సొంత బంధువులే తిట్టిపోస్తున్నారు.
దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ భార్య రుబినా శర్మ సింగ్ మాత్రం డిగ్గీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. లక్ష్మణ్ సింగ్ మొదటి భార్య చనిపోయినప్పుడు ఆయన రుబినా శర్మని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట. అప్పుడు దిగ్విజయ్ లక్ష్మణ్ సింగ్ రెండో వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడట. అన్నని ఎదిరించి మరీ లక్ష్మణ్ సింగ్ పెళ్ళి చేసుకుంటే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న దిగ్విజయ్ తమ్ముణ్ణిమానసికంగా వేధించాడట. ఆ ఫ్లాష్ బ్యాక్‌ని రుబినా ఇప్పుడు గుర్తు చేస్తోంది. తమ్ముడి రెండో పెళ్ళిని వ్యతిరేకించిన దిగ్విజయ్ తను మాత్రం అక్రమ సంబంధం పెట్టుకుని, అది బయటపడేసరికి పెళ్ళి పాట పాడుతూ వుండటం న్యాయమా అని రుబినా ప్రశ్నిస్తోంది.