జగన్ పార్టీలోకి ఇంద్ర కరణ్
posted on Dec 1, 2012 @ 4:21PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇంద్ర కరణ్ రెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన జిల్లా కే చెందిన మాజీ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప కూడా జగన్ పార్టీలో చేరారు. ఈ నెల 17 వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగే బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో వీరు జగన్ పార్టీలో అధికారికంగా చేరనున్నారు.
ఈ ఇద్దరు నాయకులు గత శుక్రవారం చంచల్ గూడా జైలులో జగన్ ను కలిసి దాదాపు గంట సేపు చర్చలు జరిపారు.ఇంద్ర కరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత. అంత క్రితం తెలుగు దేశం పార్టీలో పని చేసిన సమయంలో అయన పార్లమెంట్ సభ్యునిగా, జిల్లా పరిషత్ అధ్యక్షునిగా కొనసాగారు.
పి వి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఇంద్ర కరణ్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఒకటిన్నర నెలల క్రితం అయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వై ఎస్ వర్గంగా ముద్ర పడ్డ ఇరువురు నేతలు మొదటి నుండి జగన్ పార్టీ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు.
తెలంగాణా ప్రత్యెక రాష్ట్రాన్ని తాము అడ్డగించమని జగన్ తనకు చెప్పారని ఇంద్ర కరణ్ అన్నారు.