పాక్ విజయంపై భారత్ టీచర్ సెలబ్రేషన్.. ఉద్యోగం నుంచి ఊస్టింగ్..
posted on Oct 26, 2021 @ 10:08AM
ఐపీఎల్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది భారత జట్టు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక భారత్ పై గెలుపుతో పాకిస్తాన్ లో సంబరాలు జరిగాయి. అయితే పాకిస్తాన్ లోనే కాదు మన దేశంలోనూ చాలా ప్రాంతాల్లో మ్యాచ్ ముగియగానే బాంబులు కాల్చారనే వార్తలు వస్తున్నాయి. పాక్ గెలిస్తే భారత్ లో బాంబులు కాల్చడం కలకలం రేపుతోంది.
తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. భారత్ పై పాకిస్తాన్ జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజస్థాన్ లో ఓ ప్రభుత్వ టీచర్ తన వాట్సాప్ అకౌంట్ లో స్టేటస్ పెట్టుకుంది. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంది. ఇది గమనించిన కొందరు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్ ను ఆరా తీసిన స్కూల్ యాజమాన్యం... ఆమెను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.
ఫీసా అత్తారి అనే మహిళా ఉపాధ్యాయురాలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్‌లో పని చేసేది. పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది. ‘‘మేం గెలిచాం’’ అని పేర్కొన్న పాకిస్థాన్ ఆటగాళ్ల చిత్రాలతో పాటు వాట్సాప్ స్టేటస్ ద్వారా నఫీసా సంతోషం వ్యక్తం చేసింది.మీరు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నారా అని తల్లిదండ్రుల్లో ఒకరు ఉపాధ్యాయురాలిని అడిగినప్పుడు, నఫీసా ‘‘అవును’’ అని సమాధానమిచ్చింది. వాట్సాప్‌లో టీచర్ స్టేటస్ స్క్రీన్‌షాట్‌లు వ్యాపించడంతో స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేర టెర్మినేషన్ లెటరును నీరజ్ మోదీ స్కూలు యాజమాన్యం జారీ చేసింది.