మరో 280 చైనా యాప్ లపై నిషేధం.. లిస్ట్ లో పబ్‌జీ కూడా?
posted on Jul 27, 2020 @ 11:52AM
టిక్‌టాక్ సహా 59 చైనా మొబైల్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశ భద్రత, పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు మరో 280 చైనా యాప్ లపై కూడా నిషేధం విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైతున్నట్లు తెలుస్తోంది. చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తోంది. 280 యాప్ లపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఆ యాప్‌ల ద్వారా సమాచారం ఎలా మారుతుందన్న అంశంపై వివరాలు సేకరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన పబ్‌జీ(PUBG)ని కూడా బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.