అంతర్జాతీయ విమానసర్వీసుల రద్దు పొడిగింపు
posted on Aug 1, 2020 @ 12:17PM
దేశంలో రోజుకు నమోదు అవుతున్న కొత్త కేసుల సంఖ్య 60వేలకు చేరువలో ఉంది. కోవిద్ 19 వైరస్ వ్యాప్తికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సామాజిక వ్యాప్తి కారణంగా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూలై 31 వరకు విధించిన నిషేధాన్ని మరో నెల పొడిగించింది. తాజాగా పొడిగించిన ఈ నిషేధం ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. అయితే ఈ నిషేధం కేవలం ప్యాసింజర్ విమానాలకు మాత్రమే వర్తిస్తుందని డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. వందే భారత్ మిషన్ లో భాగంగా కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులు అవసరాన్ని బట్టి నడుస్తాయి. దేశీయ విమాన సర్వీసులు, కార్గో సర్వీసులు నడుస్తాయి.