గుడివాడ అమర్‌నాథ్ ‘గుడ్డు’ పగలబోతోంది!
posted on Jun 25, 2024 @ 2:50PM
గతించిపోయిన వైసీపీ ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్న, జగన్ మంత్రుల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువగా వున్న మంత్రిగా పేరు తెచ్చుకున్న గుడివాడ అమర్‌నాథ్ తన హయాంలో గాజువాకలో ఒక షాపింగ్ కాంప్లెక్స్.ని నిబంధనలు విరుద్ధంగా కట్టారు. ఈమధ్యే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కుప్పకూలిపోయింది. ఇక తర్వాత కుప్పకూలబోయేది కూడిగుడ్డు మంత్రి ‘గుడ్డు’ అని తెలుస్తోంది. అక్రమంగా కట్టిన షాపింగ్ కాంప్లెక్స్.ని నేలమట్టం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గతంలో అన్ని అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. దీన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్న అమర్‌నాథ్ ఆ భవనాన్ని ఎలా కూలగొట్టాలా అని ప్లాన్ చేశారు. మాస్టర్ ప్లాన్ రహదారి విస్తరణకు భూమి వదలకుండా నిర్మాణం చేశారనే సాకు చెబుతూ, పూర్తయిన భవనాన్ని సగానికి పైగా కూలగొట్టించారు. అత్తకు బుద్దిచెప్పి కోడలు మూకుడు నాకినట్టు ఇప్పుడు అదే అమర్‌నాథ్ ఎలాంటి అనుమతులు లేకుండా అదే గాజువాకలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు.
జీవీఎంసీ 70వ వార్డులో చట్టివానిపాలెం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని కోడిగుడ్డు అమర్‌నాథ్ జీ ప్లస్ ఫోర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 2 వందల అడుగుల నుంచి 266 అడుగులకు విస్తరించాలని జీవో నంబర్ 136లో పేర్కొన్నారు. ఆ ప్రకారం అమర్‌నాథ్ తన భవంతిని రోడ్డుకు 53 అడుగులు విడిచిపెట్టి నిర్మించాల్సి వుంటుంది. కానీ, అధికార బలంతో వున్న ఆయన అలా చేయకుండా భారీ భవనం నిర్మించారు. స్థలాన్ని వదిలిపెట్టే విషయంలోనే కాకుండా ఇంకా అనేక అంశాలలో అమర్‌నాథ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. మరి... నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టుగా, పల్లా శ్రీనివాసరావు భవనాన్ని ఎలా కూల్చారో, ఇప్పుడు కోడిగుడ్డు అమర్‌నాథ్ భవనాన్ని కూడా అలాగే కూల్చాలి కదా!