టెలిగ్రామ్ ద్వారా సినిమాల కొనుగోలు.. ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే వాస్తవాలు!
posted on Jan 2, 2026 8:38AM
ఆన్‌లైన్ సినిమా పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవి విచారణలో ఒక్కొక్కటిగా సంచలన వాస్తవాలు వెల్లడౌతున్నాయి. పోలీసుల విచారణలో.. రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకొని అనేక సంవత్స రాలుగా వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేలింది. ముఖ్యంగా బొమ్మ రవి టెలిగ్రామ్ యాప్‌ను వేదికగా చేసుకొని సినిమాలను అక్రమంగా కొనుగోలు చేసి.. వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం ద్వారా కోట్లలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు.
ఐబొమ్మ రవిని మూడ దఫాలుగా కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు రవి టెలిగ్రామ్ యాప్ ద్వారా నేరుగా సినిమా కంటెంట్‌ను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. సాధారణ సినిమా లకు ఒక్కో సినిమాకు సగటున 2 డాలర్లు చెల్లించగా, పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా 500 డాలర్లు వరకూ చెల్లించినట్లు నిర్ధారించారు. చిన్న బడ్జెట్ సినిమాల కోసం 100 నుంచి 200 డాలర్ల మధ్య చెల్లింపులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా ముందుగానే సినిమాలను సేకరించి, విడుద లైన వెంటనే అక్రమంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఐ బొమ్మ రవి నేర జీవితం తాజాగా ప్రారంభమైనది కాదని, 2007 నుంచే ఈ అక్రమ కార్యకలాపాలను మొదలెట్టాడనీ పోలీసులు తమ విచారణలో తేలినట్లు చెప్పారు. విద్యార్థిగా ఉన్న దశలోనే విలాసవం తమైన జీవితం గడపాలనే ఆశతో చిన్నచిన్న నేరాలకు అలవాటు పడిన రవి.. ఆ తరువాత సైబర్ నేరాల వైపు అడు గులు వేసినట్లు చెబుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన రవి, ఆ పరిజ్ఞా నాన్ని చట్టవిరుద్ధ కార్యకలా పాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఐబొమ్మ ద్వారా సంపాదించిన అక్రమ ఆదాయాన్ని దాచిపెట్టేందుకు రవి అనేక మార్గాలను ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు వేర్వేరు పేమెంట్ గేట్‌వేల ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపి నట్లు తేలింది. అంతేకా కుండా.. అనేక బ్యాంకు ఖాతా లను తెరిచి, వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించిన రవి, కొన్ని ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు కూడా మర్చిపోయినట్లు విచారణలో చెప్పడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశం ద్వారా రవి ఎంత విస్తృతం గా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడో అర్థమవు తోందని పోలీసులు అంటున్నారు.రంగారెడ్డి జిల్లా అడ్రస్ పేరుతో రవి మూడు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీలు వాస్తవ వ్యాపార లావాదేవీ లకు కాకుండా, అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపించేందుకు మాత్రమే ఉపయోగించిన షెల్ కంపెనీలుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కంపెనీల పేరుతో టాక్స్ ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను వెతికినట్లు, నకిలీ ఖాతాలు, తప్పుడు లెక్కలు చూపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులో ఐ బొమ్మ రవికి సహకరించిన వ్యక్తులు, కంటెంట్ సరఫరా చేసిన వర్గాలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణను మరింత విస్తృతం చేస్తున్నారు. రవి కార్యకలాపాలతో సినిమా పరిశ్రమకు జరిగిన నష్టంపై కూడా అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.